కావేరీ నదిని దక్షిణ గంగ అని పిలుస్తారు.సహ్య పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1320 మీటర్ల ఎత్తున మైసూర్ లోని బ్రహ్మగిరి కొండపై కావేరి నది ఆవిర్భవించంది.
కొడుగు లేదా కూర్గు అనే ప్రాంతం ఈ నదికి రూప కల్పన చేస్తుంది.కావున ఈ నది “కూర్గు కువూరి” అని కావేరి ఉద్భవించే ప్రదేశాన్ని ‘తలక్కాలేరా’ అని అంటారు.
కావేరి పుట్టే చోట ఒక చిన్న తొట్టె ఆకారంలో ఉంటుంది.ఈ తలక్కామేరిలో కావేరిమాల్ పెద్ద విగ్రహం ఉంది.
కావేరి దేవతగా భక్తులు పిలుస్తారు.భక్తుల కోర్కెలు తీర్చే ఇల వేల్పుగా కావేరి దేవత పేరు పొందినది.
ఈ దేవతకు ప్రతి ఏటా శ్రావణ మాసంలో గొప్ప ఉత్సవం జరుగుతుంది.దక్షిణ గంగగా పేరు పొందిన కావేరికి షింసా, భవానీ అనే రెండు ముఖ్యమైన ఉప నదులు కూడా ఉన్నాయి.
ఇవే కాకుండా కనక, సుజోజ్యోతి, హేమావతి, లోకాపాము, అర్ఖావతి, తొప్పైయ్యేరు, శరభంగ, మణిమధుర, హాళే, సాగరఘాట్, లక్ష్మణ తీర్థ, కాబిని కుండల, అమరావతి మొదలగు చిన్న పెద్ద మొత్తం కలిసి 50కిపైగా కావేరికి ఉప నదులు ఉన్నాయి.వీటివల్ల కావేరి వెడల్పు పెరిగి ప్రవాహం పెరిగి ప్రవహిస్తుంది.
కావేరి పరివాహక ప్రాంతం అంతా సస్యశ్యామలం.అందుకే కావేరిని “పొన్న” అని అంటారు.
పొన్ని అంటే ధాన్యం అని బంగారు అని రెండు అర్థాలు.ఈ నది ధాన్య సమృద్ధి కలిగించేది, బంగారు పంటలు పండించేదని అర్థం.
అలాగే ఈ కావేరి నదికి పేరు, కూరు కొండల్లో జన్మించి, కొంతదూరం పర్వత సీమలందే ప్రవహించి తర్వాత ఆగ్నేయదిశగా ప్రవహించి మైసూరు రాష్ట్రంలో పీఠభూమి దశ వదిలి క్రిందనగల పల్లలోకిని శివ సముద్రం వద్ద దూకుతుంది.అక్కడే కావేరి రెండుగా చీలుతుంది.ఈ రెండు చీలకల పేర్లు పరుచుక్కి, గగనచుక్కి అని పిలుస్తారు.పరచుక్కి 230 అడుగులు క్రిందికి ఒక జలపాతంలా పడుతుంది.గగనచుక్కి అద్భుతంగా 90కి.మీ.కొండచరియల్లో కావేరినదీ అలసట లేకుండా ప్రవహిస్తుంది.శివ సముద్రం దాటిన తర్వాత కావేరి తమిళనాడు రాష్ట్రంలో ప్రవేశించి, తంజావూరు జిల్లాలో అధిక శాతం ప్రవహించి కావేరి అక్కడ నుండి మరి కొంత దూరం సాగి బంగాళాఖాతంలో కలుస్తుంది.
GENERAL-TELUGU