వైరల్: అనంతమైన ప్రేమ అంటే ఇదే... వృద్ధాప్యంలో కూడా చెక్కుచెదరని బంధం!

ప్రేమంటే అదేదో సినిమాలలో చూపించేది అనుకునేవారు.అలా అనుకొనే చాలామంది మోసపోతున్నారు.

 Viral This Is What Infinite Love Is A Bond That Remains Intact Even In Old Age,-TeluguStop.com

ప్రేమించుకున్నాం అని చెప్పి పెళ్లిళ్లు చేసుకొని సంవత్సరం తిరగకుండానే చాలామంది జంటలు విడిపోవడం మనం చూస్తూ వున్నాం.అయితే ప్రేమ అనేది( Love ) ఎలా ఉంటుందో వయసు మళ్ళిన ఇక్కడ ఓ జంటని చూస్తే యిట్టె బోధ పడుతుంది.

అవును, ప్రేమ అంటే వ్యామోహం, దైహిక ఆకర్షణ ఎంతమాత్రమూ కాదు.ప్రేమను పెళ్లిబంధంతో గెలిపించుకోవడం అంటే ఆజన్మాంతం ఆ ప్రేమకు కలంకం రాకుండా దానిని కాపాడుకోవడంలోనే ఉంటుంది.

ఫోన్లలో గంటల కొద్దీ మాట్లాడటం, విచ్చలవిడిగా తిరిగేయడం… అవసరం తీరాక సహచరిని వదిలేయడం కామం అవుతుందిగాని ప్రేమ కాదు.మరి ప్రేమంటే, నమ్మి వచ్చిన సహధర్మచారిణిని ఎటువంటి పరిస్థితులలో కూడా కంటికి రెప్పలా కాపాడుకోవడం మన బాధ్యత.

ఆ బాధ్యత జీవిత చరమాంకంలో కూడా ఉండాలి.నిజమైన ప్రేమ అంటే అదే.అయితే దానిని సాక్షాత్తూ నిజం చేస్తూ నిలువెత్తు ప్రేమకు ఆదర్శంగా నిలిచారు ఓ జంట.ఆ జంటను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

ఇక్కడ వైరల్ అవుతున్న అందమైన వృద్ధ జంట( Beautiful old couple )ను చూస్తే, అస్సాంలో రద్దీగా ఉన్న రోడ్డుపై నడుచుకుంటూ రావడం గమనించవచ్చు.సడెన్ గా వాహనాలు వెళ్లే వైపు భార్య నడుస్తుంటే.ఆమెను తనకు అవతల వైపుకులాగి తాను రోడ్డువైపు ఆ భర్త నడుస్తాడు.పైగా ఆమె చెయ్యి పట్టుకుని ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్తుంటాడు.భార్యకు ఏ ప్రమాదం జరగకుండా సేఫ్ సైడ్‌కి లాగి ఒకరికొకరు చేతులు పట్టుకుని తోడుగా నడుస్తున్న విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.ఈ వీడియోను జెనిఫర్ రెహమాన్ అనే యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా లక్షల్లో చూస్తున్నారు.

లైకులు, కామెంట్లు అయితే లెక్కేలేదు.ట్రూలవ్‌ అండ్‌ కేరింగ్‌ అని ఒకరు, బెస్ట్‌ లవ్‌ అంటూ కొందరు కామెంట్‌ సెక్షన్‌లో తమ స్పందనను తెలపడం గమనించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube