ఈ గుర్రం ఆత్మ విశ్వాసానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

మ‌నం ఎంత‌టి స‌మ‌స్య‌ల్లో ఉన్నా స‌రే మ‌న మీద మ‌న‌కు ఉండే ఆత్మ విశ్వాస‌మే మ‌న‌ల్ని కాపాడుతుంది.ఆ క్ష‌ణంలో ఎలా బ‌య‌ట ప‌డాలో అని ఆలోచించాలే త‌ప్ప‌.

 Hats Off To This Horse For Self Confidence Details, Horse Confidence, Viral Vide-TeluguStop.com

ఆ స‌మ‌స్య ఎంత పెద్ద‌ది అని భ‌య ప‌డ‌కూడ‌దు.స‌మ‌స్య గురించి ఆలోచిస్తే మ‌న మీద మ‌న‌కున్న న‌మ్మ‌కం కోల్పోతాం.

స‌మ‌స్య అనేది మ‌న బ‌లం కంటే పెద్ద‌దా లేదా చిన్న‌దా అని ఆలోచించే కంటే.ఆ క్ష‌ణంలో ఎలా బ‌య‌ట ప‌డాలో మాత్ర‌మే ఆలోచించాలి.

స‌మీక‌ర‌ణాల‌ను ప‌క్క‌న పెట్టేసి ప్ర‌య‌త్నాల మీద‌నే దృష్టి పెట్టాలి.మ‌న‌సులో మ‌నం గెలుస్తామ‌నే ఆకాంక్ష మాత్ర‌మే ఉండాలి.

అలా అయితేనే ఎలాంటి ప‌రిస్థితుల‌ను అయినా జ‌యించ‌గ‌లుగుతాం.లేక‌పోతే అంతే సంగ‌తులు.ఏ కొంచెం అప‌న‌మ్మ‌కంగా ఉన్నా స‌రే మ‌న ప్రాణాలు గాల్లో క‌లిసిపోతాయి.ఇప్పుడు కూడా ఓ గుర్రం ఇలాగే ఆలోచించి త‌న ప్రాణాల‌ను ర‌క్షించుకుంది.

అయితే దాని ఆత్మ విశ్వాస‌మే దాన్ని ప్రాణాల నుంచి బ‌య‌ట‌ప‌డేసింది.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చెక్క‌ర్లు కొడుతోంది.

ఈ వైర‌ల్ వీడియోలో ఓ గుర్రం రెండు రైలు ప‌ట్టాల న‌డుమ ఇరుక్కుని పోవ‌డం మ‌నం ఇందులో చూడొచ్చు.అయితే స‌డెన్ రెండు ట్రైన్లు వ‌స్తాయి.

అత్యంత వేగంతో ఆ ట్రైన్లు రావ‌డం మ‌నం ఇందులో చూడొచ్చు.అయితే ఏ కొంచెం త‌ల అటు ఇటుగా వంచినా స‌రే ఆ ట్రైన్లు ఢీకొట్ట‌డం ఖాయం.

అయినా స‌రే ఆ గుర్రం ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా.ల‌క్ష్యం వైపు ప‌రుగులు తీయ‌డం ఇందులో మ‌నం చూడొచ్చు.

చివ‌ర‌కు ఇలా ఆత్మ విశ్వాసంతో ముంద‌కు వెళ్లి త‌న ప్రాణాల‌ను నిల‌బెట్టుకుంటుంది.ఇలా ఒక రైలు త‌న‌ను దాటి వెళ్లిపోయిన త‌ర్వాత మ‌రో ట్రాక్ మీద‌కు వెళ్ల‌డం ఇందులో చూడొచ్చు.

ఈ వీడియో చూసిన వారంతా కూడా వావ్ అంటూ కామెంట్లు పెడుతువ‌న్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube