తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్- Telugu NRI America News

1.ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో సాహితీ సదస్సు

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో సాహితీ సదస్సు ఆసక్తికరంగా సాగింది.

సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీనివాసులు బాశబత్తిన అంతర్జాలం లో సభకు విచ్చేసిన సాహితీ వేత్తలకు నమస్కారం తెలియజేశారు. 

2.అమెరికాలో భారతీ యువకుడి కాల్చివేత

 

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర�

అగ్రరాజ్యం అమెరికాలో ఘోర సంఘటన జరిగింది.భారత యువకుడిని ఓ దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు.టెక్సాస్ లోని హుస్టన్ లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది.మృతుడు గోవాకు చెందిన జాన్ దివాస్ (27) గా పోలీసులు పేర్కొన్నారు. 

3.అంతర్జాతీయ ప్రయాణికులపై అంశాలు తొలగించిన ఇండోనేషియా

 

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర�

అంతర్జాతీయ ప్రయాణికులపై ఇండోనేషియా క్వారంటైన్ ఆంక్షలను తొలగించింది. 

4.భారతీయ విమాన సర్వీసుల పై నిషేధం ఎత్తివేసిన హాంకాంగ్

  భారతీయ విమాన సర్వీసుల పై హాంకాంగ్ నిషేధం ఎత్తివేసింది.ఇది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది. 

5.అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా స్కూల్ విద్యార్థుల నిరసనలు

 

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర�

అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తన పదవి నుండి దిగిపోవాలని కోరుతూ కిండర్ గార్డెన్ విద్యార్థులు నినాదాలు చేయడం వైరల్ గా మారింది. 

6.చైనాలో పెరుగుతున్న కరోనా కొత్త వేరియంట్ కేసులు

  చైనాలో కరోనా కొత్త వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.

Advertisement

ఒమిక్రాన్ సబ్ వేరియంట్ స్టెళ్త్ ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.చైనా లో ప్రస్తుతం నాలుగు వేలకు పైగా కేసులు నమోదు అవుతుండడంతో ఇప్పటికే కొన్ని నగరాల్లో లాక్ డౌన్ ఆంక్షలను విధించారు. 

7.పశ్చిమ దేశాలకు రష్యా వార్నింగ్

 

రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది.దాదాపు నెల రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా సేనలు దాడులు నిర్వహిస్తున్నాయి.తమ దేశ ఉనికికి ముప్పు ఏర్పడితే తప్పనిసరిగా అణ్వాయుధాలను వినియోగిస్తామని పశ్చిమ దేశాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. 

8.రష్యా ప్రతిపక్ష నేతకు తొమ్మిది ఏళ్ల జైలు శిక్ష

  రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావెల్ని కి కోర్టు తొమ్మిదేళ్ళ జైలు శిక్ష , రూ.8.75 లక్షల జరిమానాను కోర్టు విధించింది.మోసం , కోర్టు ధిక్కరణ తదితర వ్యవహారాల కారణంగా ఈ శిక్షను విధించింది. 

9.కూలిన విమానం బ్లాక్ బాక్స్ గుర్తింపు

 

చైనా ఈస్టర్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 737 నిన్న కోరిన సంగతి తెలిసిందే ఈ ప్రమాద ఘటనలో మొత్తం 133 మంది మృతి చెందారు అయితే ఈ విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ ను అధికారులు గుర్తించారు. 

10.తైవాన్ లో భారీ భూకంపం

  తైవాన్ లో భారీ భూకంపం సంభవించింది.

తైపీ లో స్వల్ప వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది.రిక్టార్ స్కేల్ పై దీని తీవ్రత 6.6 గా నమోదు అయ్యింది.

నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!
Advertisement

తాజా వార్తలు