మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు డైరక్షన్ లో వస్తున్న సినిమా ధమాకా.సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.
సినిమాలో రవితేజ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది.సినిమాలో కొద్దిసేపు ఒక కంపెనీ సీ.ఈ.ఓ గా బాగా రిచ్ ఉన్న వాడిగా కనిపించే రవితేజ మరికొద్దిసేపు మధ్యతరగతి వ్యక్తిగా కనిపిస్తారట.సీ.ఈ.ఓ కోసం రౌడీలు వెతుకుతుంటే వాళ్లకి ఈ మిడిల్ క్లాస్ వ్యక్తి కనిపిస్తాడట.
ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ కథతో నక్కిన త్రినాథ రావు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ఖిలాడి సినిమాతో మరోసారి నిరాశపరచాడు.ఇక రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.
వీటితో పాటుగా సుధీర్ వర్మ డైరక్షన్ లో వస్తున్న రావణాసుర సినిమా కూడా లైన్ లోనే ఉంది.ఈ సినిమాలతో మాస్ రాజా రవితేజ తన ఫ్యాన్స్ ని అలరించాలని చూస్తున్నాడు.
రాబోతున్న ఈ సినిమాలతో మాత్రం రవితేజ మరోసారి తన స్టామినా ఏంటో చూపిస్తాడని అంటున్నారు.