టాలీవుడ్ లో మరో వారసుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.తెలుగు పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా బడా సినిమాలు చేస్తున్న డివివి దానయ్య తనయుడు కళ్యాణ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఓ సినిమా ఎనౌన్స్ చేశారు.
టాలెంటెడ్ డైరక్టర్ ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో అథీర సినిమాతో దానయ్య తనయుడు కళ్యాణ్ తెరంగేట్రం చేస్తున్నాడు.అ! నుండి రాబోతున్న హనుమాన్ సినిమా వరకు తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ ని ఏర్పరచుకున్న డైరక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ రిలీజ్ కు ముందే అథీరా ఎనౌన్స్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
హనుమాన్ సినిమానే సూపర్ హీరో కథతో వస్తున్నాడని తెలుస్తుండగా ఈ అథీర సినిమా కూడా సూపర్ హీరో కథతో వస్తుందని తెలుస్తుంది.అంతేకాదు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని హాలీవుడ్ మేకర్స్ స్టైల్ లో డైరక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమా ఎనౌన్స్ చేశాడు.
అంతేకాదు కళ్యాణ్ మొదటి సినిమానే తెలుగుతో పాటుగా పాన్ ఇండియా రిలీజ్ ఫిక్స్ చేశారు.హనుమాన్ కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశాడు ప్రశాంత్ వర్మ.
అథీర టీజర్ ని ఆర్.ఆర్.ఆర్ టీం రిలీజ్ చేసి చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ అందించారు.