మార్చి 25 అంటే ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న భారీ సినిమా ఆర్.ఆర్.
ఆర్ కు కన్నడ ఆడియెన్స్ నుండి పెద్ద షాక్ తగిలింది.సినిమాను బాయ్ కాట్ చేయాలని Boycott RRR అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.
ఆర్.ఆర్.ఆర్ టీం కి ఇది ఊహించని షాక్ అని చెప్పొచ్చు.అసలు కన్నడ ప్రేక్షకులు ఎందుకు ఆర్.ఆర్.ఆర్ ని బాయ్ కాట్ చేయాలని కోరుతున్నారు అంటే ఆర్.ఆర్.ఆర్ సినిమా కన్నడ వర్షన్ రిలీజ్ అవుతున్నా ఎక్కువగా అక్కడ సిటీల్లో తెలుగు వర్షన్ అందుబాటులో ఉండటమే వారి భాష మీద వారికి ఉన్న గౌరవం కొద్దీ ఆర్.ఆర్.ఆర్ ని తమ భాషలోనే అక్కడ ఎక్కువ థియేటర్ లు రిలీజ్ చేయాలని ట్విట్టర్ లో హడావిడి చేస్తున్నారు.
అయితే దీనిపై వెంటనే స్పందించిన కన్నడ రిలీజ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్.ఆర్.ఆర్ సినిమా తెలుగు వర్షన్ మాత్రమే కాదు కన్నడ వర్షన్ ఎక్కువ థియేటర్ లు రిలీజ్ అవుతున్నాయని గొడవ సర్ధుమనిగేలా చేస్తున్నారు.టాలీవుడ్ స్టార్ సినిమా పాన్ ఇండియా రిలీజ్ టైం లో ప్రతిసారి కన్నడ ప్రేక్షకులు ఈ విధమైన హడావిడి చేయడం కామన్ అయ్యింది.