తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 5, ఆదివారం2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.20

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.39

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు.

Advertisement

దుర్ముహూర్తం: సా.5.02 సా5.53

మేషం:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగే అవకాశం ఉంది.కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

యూకే ఎన్నికల్లో సిక్కు సంతతి ఎంపీల ప్రభంజనం.. అకల్ తఖ్త్ , ఎస్‌జీపీసీ ప్రశంసలు
సినిమా ఫ్లాప్ అయినా వాణిశ్రీ కట్టిన ఆర్గాండి వాయిల్ చీరలు ఫుల్ ఫేమస్

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

Advertisement

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు పొందే అవకాశముంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.మీ భాగస్వామి నుండి ఒక సహాయం అందుతుంది.

చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు మీరు వాయిదా పడ్డ పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల పని త్వరగా పూర్తవుతుంది.కాస్త విశ్రాంతి దొరుకుతుంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

కర్కాటకం:

ఈరోజు కొన్ని పనులు వాయిదా పడతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీ భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

సింహం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా నష్టాలు కూడా ఉంటాయి.కొన్ని వస్తువులు చేజారే అవకాశం ఉంది.

తీరిక లేని సమయం తో మీ పనులు ఉంటాయి.దీనివల్ల కాస్త మనశ్శాంతి కోల్పోతారు.

మీ భాగస్వామి నుండి సహాయం అందుతుంది.దూర ప్రయాణాలు వాయిదా వేయాలి.

కన్య:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.ఆర్థికంగా కొన్ని లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.

మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

తుల:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.

దీనివల్ల మరింత సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగావకాశం ఉంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.లేదా భవిష్యత్తులో మరింత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది.

అనుకోకుండా కొన్ని ప్రయాణం చేయవలసి ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి కాస్త శ్రద్ధ పెట్టాలి.

ఉద్యోగస్తులకు ఒత్తిడి ఉంటుంది.

ధనుస్సు:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

భవిష్యత్తులో కొన్ని లాభాలు ఎదురయ్యే అవకాశం ఉంది.తల్లిదండ్రులతో కలిసి కొన్ని విషయాల గురించి మాట్లాడతారు.

ఈ రోజంతా బాగానే ఉంది.

మకరం:

ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఉంటాయి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.దీనివల్ల బాధపడాల్సి ఉంటుంది.

ఆరోగ్యం కూడా సహకరించదు.మీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులన్నీ మధ్యలో ఆగిపోతాయి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతోంది.

కుంభం:

ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.ధనం పట్ల ఖర్చులు ఎక్కువగా చేస్తారు.భవిష్యత్తులో ఇబ్బందులు కూడా ఎదురవుతాయి.

తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు.వ్యాపారస్థులకు పనులు వాయిదా పడతాయి.

మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మీనం:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వారితో కాలక్షేపం చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

తాజా వార్తలు