తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ రాజీనామా

తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా చేశారు.వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న సమయంలో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చకు దారితీసింది.అయితే సీఎండీ వంటి పోస్టులో సాధారణంగా ఐఏఎస్ అధికారులను నియమిస్తుంటారు.

కానీ గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ ప్రభాకర్ రావును సీఎండీగా నియమించిన విషయం తెలిసిందే.అప్పటి నుంచి ఆయన పదవీ కాలం ముగిసిన ప్రతిసారీ ప్రభుత్వం రెండేళ్ల పాటు పొడిగిస్తూ వచ్చింది.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందిన సమయంలో సీఎండీగా ప్రభాకర్ రావు బాధ్యతల నుంచి వైదొలగడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు