జానారెడ్డిని కలిసిన రేవంత్ రెడ్డి.. అధిష్ఠానం సరైన నిర్ణయం తీసుకుందంటున్న నేతలు.. !

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ని ఎన్నిక చేసినప్పటి నుండి ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేవట.కానీ ఇక్కడొక సమస్య వచ్చిపడింది.

అదేమంటే.రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించడం కొందరికి ఆమోదయోగ్యం అవగా, మరికొందరు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట.

ఇక ఎవరి బాధ వారికుండగా గులాభి బాస్‌ను ఎదుర్కోవాలంటే రేవంత్ రెడ్డి వల్లే అవుతుందని భావించిన అధిష్టానం ఎవరు ఏమనుకుంటే ఏంటని ఈ నిర్ణయం తీసుకుందట.ఇకపోతే తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను ఒక్కొక్కరిని కలుసుకుంటు వస్తున్నారట.

ఈ క్రమంలో గత రాత్రి పార్టీ సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డిని కలిశారు.

Advertisement
Telangana Congress Pcc Chief Rawanth Reddy Met Jana Reddy, Telangana, Congress,

అనంతరం శాననమండలి మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లారు.

Telangana Congress Pcc Chief Rawanth Reddy Met Jana Reddy, Telangana, Congress,

ఇక రేవంత్ రెడ్డి నియామకంపై స్పందించిన పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్‌ను నియమించి అధిష్టానం మంచి నిర్ణయమే తీసుకుందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు