ఈ మధ్య ఒకప్పటి స్టార్ హీరోలంతా యంగ్ హీరోలతో పోటీగా వరుస సినిమాలలో కీలకపాత్రలలో నటిస్తుంటే.అప్పటి స్టార్ హీరోయిన్స్ మాత్రం రీ ఎంట్రీ తో తమకు తగ్గట్టు పాత్రలలో నటిస్తున్నారు.
ఇప్పటికే విజయశాంతి, రమ్యకృష్ణ, సంగీత, ఆమని వంటి పలువురు స్టార్ హీరోయిన్స్ తమ వయసుకు తగ్గట్టు పాత్రలలో మెప్పిస్తున్నారు.ఇదిలా ఉంటే మరో స్టార్ హీరోయిన్ హీరో కార్తీ సినిమాలో నటించనుందట.
తమిళ స్టార్ హీరో కార్తీ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.కొన్ని డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీ.ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలలో నటించాడు.అంతేకాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి అభిమాని హీరోగా మారాడు.
తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకొని ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు.ఇక ఈయన ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉన్నాడు.

ఇక ప్రస్తుతం ఈయన నటించనున్న సినిమాలో మరో పవర్ ఫుల్ లేడీ స్టార్ హీరోయిన్ విలన్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సిమ్రాన్.ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందింది.బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి తెలుగు స్టార్ హీరోలతోనే కాకుండా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, విజయ్ వంటి పలువురు హీరోల సరసన కూడా నటించింది.
ఇక మళ్లీ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ తో ఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్ చాలా వరకు కంటెంట్ ఉన్న సినిమాలలో నటిస్తుంది.పైగా తన వయసు తగ్గట్టు పాత్రలలో మెప్పిస్తుంది.
ఇక ఈమె తాజాగా కార్తీ నటించనున్న తదుపరి సినిమాలో విలన్ పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయం గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేకపోగా త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.