కమలం కేసీఆర్ అహంకారాన్ని అణిచి వేస్తుంది.. తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ కీలక వ్యాఖ్యలు.. !!

ఎప్పుడైతే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారో అప్పటి నుండి గులాభి పార్టీ పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయట.

సామాన్యంగా కారు పార్టీలో ఎవరైన నేత అలిగి పక్క పార్టీ వైపు చూస్తే టీఆర్ఎస్ పెద్దల్లో ఎవరో ఒకరు రంగంలోకి దిగి వారి అలకకు కారణాలు తెలుసుకుని బుజ్జగించే ప్రయత్నం చేస్తారు.

వారు కోరుకున్న వరాలు కూడా ఇస్తామని హమీలు కూడా గుప్పిస్తారట.కానీ ఈటల విషయంలో అలా జరగలేదు.

Telangana Bjp Incharge Tarun Chugh Comments On Trs Telangana, Bjp Incharge, Taru

నిర్దాక్షిణ్యంగా వ్యవహరించినట్లుగా ఈటల అభిమానులు వాపోతున్నారట.ఇకపోతే హూజురాబాద్ నియోజక వర్గంలో త్వరలో ఉప ఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ టీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.రానున్న ఎన్నికల్లో అవినీతి పరులు ఓడిపోతారని, ముఖ్యంగా కేసీఆర్ అహంకారాన్ని హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో కమలం అణిచి వేస్తుందని వ్యాఖ్యానించారు.

Advertisement

అదీగాక తెలంగాణలో వారసత్వ రాజకీయాలను అంతం చేసి, రైతులను, యువకులను మోసం చేస్తున్న కారు పార్టీని గ్యారేజీలోకి పంపించడం ఖాయం అంటూ పేర్కొన్నారట.మరి చూడాలి రానున్న రోజుల్లో జరిగే రాజకీయ మార్పు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు