దుల్కర్ సల్మాన్ ( Dulquer Salmaan )పరిచయం అవసరం లేని పేరు.మలయాళ నటుడు అయినప్పటికీ ఈయనకు తెలుగులో మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఈయన పూర్తిస్థాయి తెలుగు సినిమా అయినటువంటి సీతారామం( Sitaramam ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో దుల్కర్ నటించే సినిమాలన్నీ కూడా తెలుగులో కూడా విడుదలవుతున్నాయి.
ఇక తాజాగా ఈయన నటించిన కింగ్ ఆఫ్ కోట( King Of Kotha ) సినిమా నుంచి టీజర్ విడుదలైన విషయం మనకు తెలిసిందే త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.ఈ క్రమంలోనే ఈయన సోషల్ మీడియా(Social media ) వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ వెంటనే దానిని డిలీట్ చేశారు.
అప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో అభిమానులు అసలు దుల్కర్ సల్మాన్ కు ఏమైంది ఎందుకు ఇలా ఒక వీడియోని షేర్ చేసే వెంటనే డిలీట్ చేశారు అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే… ఇందులో ఆయన కన్నీళ్లు తుడుచుకుంటూ కొంత సమయం పాటు నాకు నిద్ర పట్టడం లేదు పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు.ఇలాంటి సంఘటనను నేను మొదటిసారి ఎదుర్కొన్నాను.నా మనసు నుంచి ఆ సంఘటనను తొలగించుకోలేకపోతున్నాను, కానీ ఈ విషయాన్ని చెప్పచో లేదో అంటూ ఉన్నటువంటి వీడియోని షేర్ చేశారు.
ఈ విధంగా ఈ వీడియో షేర్ చేసిన కొంత సమయానికే ఆయన డిలీట్ చేశారు.అప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో అభిమానులు దిల్కర్ సల్మాన్ ఇంతలా బాధపడటానికి గల కారణం ఏంటి అసలు ఆయనకేమైంది మీరు బానే ఉన్నారు కదా అంటూ పెద్ద ఎత్తున అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.మరి ఈయనని అంతగా బాధ పెట్టిన ఆ సంఘటన ఏంటో తెలియాలి అంటే స్వయంగా దుల్కర్ స్పందించాల్సి ఉంది.