సినీ నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బండ్ల గణేష్(Bandla Ganesh) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లో ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారు.పవన్ కళ్యాణ్ తణుకు దైవ సమానులని బండ్ల గణేష్ తరచూ పవన్ కళ్యాణ్ ను ఆరాధిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే నేడు గురు పౌర్ణమి కావడంతో తాను గురువుగా భావించే పవన్ కళ్యాణ్ కు ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ గురు పూర్ణిమ శుభాకాంక్షలు చెబుతూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సందర్భంగా బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.

గురు పౌర్ణమి(Guru Purnima) సందర్భంగా మా గురువుగారికి శుభాకాంక్షలు మీరు ఎల్లప్పుడు ఇలాగే ఉండాలి మీరు అనుకున్నవన్నీ నెరవేరాలి.మీ స్థాయి స్థానం తెలిసిన వాడిగా చెబుతున్నాను మీ కీర్తి వాడుకొని నేను లబ్ది పొందను అవసరమైతే మీకు సహాయం చేస్తా లేకపోతే దూరంగా ఉంటాను.అంతేకానీ మీ కీర్తి ప్రతిష్టలను వాడుకొని నేను ఎప్పుడు లాభం పొందాలని అనుకోను నా ఆశయం అంతా ఒకటే మీరు అనుకున్నది నెరవేరాలి.స్వార్థం లేనటువంటి మీ మనసు లాగే మీరు పది కాలాలపాటు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.

ఈ విధంగా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ క్షేమం కోరుతూ ఆయనకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఈట్వీట్ ఆయనకు టాగ్ చేశారు.దీంతో పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్ కు ఏ విధమైనటువంటి అభిమానం భక్తి ఉందో అర్థం అవుతుంది.అయితే ఈయనకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గత కొంతకాలంగా పడటం లేదని తెలుస్తుంది.ఇక త్రివిక్రమ్(Trivikram) పవన్ కళ్యాణ్ కు చాలా సన్నిహితుడు అనే విషయం మనకు తెలిసిందే.
ఇలా పవన్ విషయంలో త్రివిక్రమ్ బండ్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.







