ఈగలు దాడి చేస్తే ఎలా ఉంటుందో రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా ఈగ చూస్తే అర్థమవుతుంది.ఈగ పగ పడితే ప్రాణాలు పోవు కానీ కంటి నిండా నిద్ర, కడుపు నిండా అన్నం మాత్రం సరిగా ఉండవు.
ఒక గ్రామం పై ముక్కుముడిగా ఈగలు దాడి చేస్తే ఆ గ్రామస్తుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా.? ఉన్నావ్ జిల్లా రుద్వార్ అనే గ్రామంలో ఎక్కడ చూసిన ఈగలే( Flies ), అసలు ఆ గ్రామంలో వేల సంఖ్యలో ఈగలు ఎందుకు ఉన్నాయో అనే వివరాలు చూద్దాం.
ఉన్నావ్ జిల్లా రుద్వార్ (Unnao )అనే గ్రామంలో సుమారుగా 5000 మంది ప్రజలు నివసిస్తున్నారు.అయితే ఆ గ్రామంలో ప్రతి చోటా ఈగలే కనిపిస్తున్నాయి.తినే ఆహార వస్తువుల మీదా, డ్రైనేజీల పైన, వ్యవసాయ పొలాలలో ఎక్కడ చూసినా ఆ గ్రామం అంతా ఈగల తో నిండిపోయింది.ఇక వర్షాకాలం వచ్చిందంటే ఆ గ్రామస్తుల పరిస్థితి తలుచుకుంటేనే ఎంతో బాధగా అనిపిస్తుంది.

ఆ గ్రామంలో ఉండే ఈగల వల్ల యువకులకు పిల్లని ఇవ్వడానికి కూడా చుట్టుపక్కల గ్రామస్తులు ముందుకు రావడం లేదు అంటే ఆ గ్రామంలో ఉండే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.అక్కడ నివసించలేక కొంత మంది వలస వెళ్లేందుకు కూడా సిద్ధపడుతున్నారు.

ఆ గ్రామంలో ఈగలు వేల సంఖ్యలో ఉండడానికి ప్రధాన కారణం ఏమిటంటే.కరోనా అనంతరం ఆ గ్రామ ప్రజలంతా జీవన ఉపాధిగా కోళ్లను పెంచడం( Chicken ) ప్రారంభించారు.కోళ్ల వ్యాపారంలో బాగానే ఆదాయం ఉండడంతో గ్రామంలో 80 శాతానికి పైగా ప్రజలు కోళ్ల పెంపకం ప్రారంభించారు.దీంతో గ్రామంలో ఎక్కడ చూసినా కోళ్ల ఫారాలే దర్శనం ఇస్తున్నాయి.
అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే కోళ్ల ఫారాల దగ్గర అపరిశుభ్రత తో పాటు దుర్వాసన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.అందుకే ఆ గ్రామాన్ని ఈగలు చుట్టూమూడాయి.
ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈగల బెడద తొలగడం లేదని ఆ గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.







