పాకిస్థాన్‌లో టీమిండియా టూర్ ఫిక్స్, ఎప్పుడంటే..?

భారత్, పాకిస్థాన్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.పాకిస్తాన్ దేశం ఇండియాపై దాడులు చేయడానికి ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.

కశ్మీర్ విషయంలో ఇప్పటికీ ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం కొనసాగుతుందంటే అతిశయోక్తి కాదు.ఇలాంటి పరిస్థితుల్లో భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాక్ లో పర్యటించడం లేదు.

అయితే 15 ఏళ్ల తర్వాత భారత క్రికెట్‌ జట్టు మళ్ళీ పాకిస్థాన్‌లో పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఆసియా కప్ 2023 ఆతిథ్య హక్కులను పాకిస్థాన్‌ దేశ క్రికెట్‌ బోర్డు చేజిక్కించుకోవడమే ఇందుకు కారణం.

తాజాగా దుబాయ్‌ లో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ భేటీ అయ్యింది.ఈ సందర్భంగా ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌.

Advertisement
Team India Tour Fix In Pakistan, When, Pakistan, Indian Tour, Latest News, Tour,

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆసియాకప్‌ 2023 వన్డే ఫార్మాట్‌ నిర్వహణ బాధ్యతలను అప్పగించింది.నిజానికి 2020లోనే ఆసియా కప్‌ను నిర్వహించే బాధ్యతలు పాక్‌కు లభించాయి.

అయితే ఆ దేశం ఆతిథ్యం ఇస్తే.తాము అసలు ఆసియాకప్‌లోనే పాల్గొనమని టీమిండియా స్పష్టం చేసింది.

అప్పట్లో పాక్‌ పర్యటనకు బీసీసీఐ కూడా ససేమిరా చెప్పింది.దీనితో పాక్‌ బోర్డు టోర్నీ నిర్వహణ బాధ్యతలను శ్రీలంకకు అప్పజెప్పింది.

కానీ శ్రీలంక తమ దేశంలో టోర్నీ నిర్వహణ అసాధ్యమని చెబుతూ ఆతిథ్య బాధ్యతల నుంచి తప్పుకుంది.ఈ అనూహ్య పరిణామాల మధ్య 2020 టోర్నీని పూర్తిగా రద్దు చేశారు.

Team India Tour Fix In Pakistan, When, Pakistan, Indian Tour, Latest News, Tour,
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ భేటీలో పాక్‌ ఆసియాకప్‌-2023 నిర్వహణ బాధ్యతలను దక్కించుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా, పీసీబీ న్యూ చైర్మన్‌ రమీజ్‌ రాజా వెల్లడించారు.మ్యాచ్ షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు.పరిస్థితులన్నీ బాగుంటే టోర్నీ 2023 జూన్‌, జులై నెలల్లో జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

Advertisement

మరి భారత ప్రభుత్వం పాకిస్థాన్‌కు వెళ్లేందుకు టీమిండియాకి అనుమతి ఇస్తుందా? అనేది అసలైన ప్రశ్న గా మారింది.

తాజా వార్తలు