ఆ ఒక్క విషయం నన్ను చాలా బాధిస్తోంది.. తమన్నా కామెంట్స్ వైరల్?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ( Tamannaah bhatia )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తమన్నా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం.

అందుకే అభిమానులు ఈమెను మిల్కీ బ్యూటీ అని కూడా పిలుస్తూ ఉంటారు.ఇకపోతే తమన్నా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ అదే రేంజ్ లో అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ మెప్పిస్తోంది తమన్నా.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తమన్నా చిరంజీవి ( Chiranjeevi ) హీరోగా నటిస్తున్న భోళా శంకర్ ( Bhola Shankar ) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమాలో కూడా నటిస్తోంది.ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమన్నా పేరు మారుమోగుతున్న విషయం మనందరికీ తెలిసిందే.

Advertisement

తమన్నా నటించిన వెబ్ సిరీస్ లపై నెటిజన్స్ టార్గెట్ చేస్తూ దారుణంగా పోలింగ్స్ చేస్తున్నారు.ఈ సందర్భంగా తాజాగా తనపై ఆన్లైన్ లో జరుగుతున్న ట్రోలింగ్స్ పై స్పందించింది తమన్నా.

ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.

14 ఏళ్లు ఉన్నప్పుడే నేను పరిశ్రమలోకి అడుగుపెట్టాను.18 ఏళ్ల ఈ సినీ కెరీర్‌లో ఎన్నో విమర్శలు చూశాను.నటిగా తొలి అడుగు వేసే సమయంలో.

మీ అమ్మాయిని ఇండస్ట్రీలోకి ఎందుకు పంపుతున్నారు? పరిశ్రమ ఎలా ఉంటుందో తెలుసా? అంటూ ఎంతోమంది తెలిసిన వాళ్లు నా తల్లిదండ్రులను ప్రశ్నించారు.ఒకవేళ ఆనాడు వాళ్ల మాటలు పట్టించుకొని ఉండి ఉంటే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

ఇక, ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా ఎంతోమంది వ్యక్తులు కామెంట్స్‌ చేస్తుంటారు.వాటిని నేను అస్సలు పట్టించుకోను.2023లో కూడా ఎవరు ఎలా ఉండాలో మీరు ఎలా చెబుతున్నారు? ముక్కు ముఖం తెలియని కొంతమంది వ్యక్తులు చేసే నెగెటివ్‌ కామెంట్స్‌ను హైలైట్‌ చేస్తూ వార్తలు సృష్టిస్తున్నారు.ఆ ఒక్క విషయమే నన్నెంతో బాధిస్తుంది.

Advertisement

వర్క్‌ విషయంలో విమర్శలు చేస్తే నేను తీసుకుంటాను.మళ్లీ ఆ తప్పులు జరగకుండా చూసుకుంటాను అని తెలిపింది తమన్నా.

తాజా వార్తలు