లవ్ స్టోరీస్ 2 వెబ్ సిరిస్ రివ్యూ..?

ఈ మధ్య చాలా వెబ్ సీరీస్ లు వస్తున్నాయి అందరిని బాగా ఆకట్టుకుంటున్నాయి అందులో భాగం గానే లస్ట్ స్టోరీస్’ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ 2018 టైంలో రిలీజ్ అయ్యి ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది.కియారా అద్వానీ, రాధికా ఆప్టే, మనీషా కోయిరాలా వంటి వారు ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సిరీస్లో శృంగారం.

ప్రేమ కి మధ్య తేడాని 5 ఎపిసోడ్స్ లో చూపించారు.5 ఏళ్ళ గ్యాప్ తర్వాత ‘లస్ట్ స్టోరీస్ 2 ‘( Lust Stories 2 ) కూడా రూపొందింది.తమన్నా,( Tamanna ) మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) వంటి వారు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ .ఫస్ట్ లుక్ నుండి అందరి దృష్టిని ఆకర్షించింది.మరీ ముఖ్యంగా ‘తమన్నా ఈ సిరీస్ లో రెచ్చిపోయి బోల్డ్ సీన్స్ లో నటించింది’ అనే ప్రచారం కూడా కొన్నాళ్ల నుండి గట్టిగా జరుగుతుంది.

మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో చూద్దాం రండి ముందుగా ఈ కథ గురించి చెప్పాలంటే ఇది ఒక కథ కాదు.నాలుగు కథలతో ముడిపడి ఉంటుంది.

వేద (మృణాల్ ఠాకూర్), అర్జున్ (అంగద్ బేడీ) టెస్ట్ డ్రైవ్ ఎపిసోడ్ మొదటి కథ.ఇందులో (నీనా గుప్తా) వేద నానమ్మగా నటించింది.కారు కొనే ముందు టెస్ట్ డ్రైవ్ ఎలా అవసరమో.

పెళ్ళికి ముందు కూడా టెస్ట్ డ్రైవ్ అవసరం అంటూ తన వారసులకు చెబుతుంది.ఆ తర్వాత ఏమైంది అనేది ఈ మొదటి కథ సారాంశం.

Advertisement

ఇషిత (తిలోత్తమా షోమే) దొంగచాటుగా పనిమనిషి సీమ (అమృతా సుభాష్) శృంగారంలో పాల్గొంటున్నప్పుడు చూసే ఎపిసోడ్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు రెండో కథ.

విజయ్ చౌహన్ (విజయ్ వర్మ) శాంతి (తమన్నా భాటియా) అను (ముక్తి మోహన్) ల భార్యాభర్తల కథ మూడోది.చందా (కాజోల్) ఆమె భర్త (కుముద్ మిశ్రా) ల గృహ హింస ఎపిసోడ్ నాలుగో కథ.మృణాల్ ఠాకూర్ ఎపిసోడ్ లో కొత్తదనం ఏమీ ఉండదు.ఆమె నటన అయితే బాగానే ఉంది.

ఇది బాలీవుడ్ వాళ్ళు చేసిన వాళ్ళు తీసింది కాబట్టి.ప్రాబ్లం లేదు.

తెలుగు ప్రేక్షకులు ఆమెను ఇలా చూడటం కష్టమే.తిలోత్తమా శర్మ కథలో కొంత ఎమోషన్ ఉంటుంది.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

ఆమె వరకు బాగానే చేసింది.తమన్నా కథలో గ్లామర్‌,శృంగారం తప్ప ఎమోషనల్ కనెక్టివిటీ ఏమీ ఉండదు.

Advertisement

కాజోల్‌ కథలో మాత్రమే కొంత ఎమోషన్ ఉంటుంది.కానీ ఈమె ఎపిసోడ్ ఇన్ కంప్లీట్ గా అనిపిస్తుంది.

కొంత డిఫరెంట్‌గా ఉంటుంది.

సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే ఆర్.బల్కి, కొంకణ సేన్ శర్మ, అమిత్ రవీంద్రనాథ్ శర్మ, సుజోయ్ ఘోష్ ఈ నాలుగు ఎపిసోడ్లను డైరెక్ట్ చేయడం జరిగింది.వాళ్ళు కామాన్ని మాత్రమే ప్రధాన అంశంగా తీసుకుని చేశారు.

మొదటి సీజన్లో అయితే కియారా అద్వానీ ఎపిసోడ్ అయినా బాగుంది అనిపిస్తుంది.సీజన్ 2 కి వచ్చేసరికి అలాంటి ఎమోషన్ మిస్ అయ్యింది.

కాజోల్ ఎపిసోడ్ కొంతలో కొంత బెటర్.కేవలం రొమాంటిక్ సన్నివేశాల కోసం ఈ సిరీస్ చూడాలి అనుకుంటే ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ తో పావుగంటలో ఫినిష్ చేసేయొచ్చు.

ఇక లస్ట్ స్టోరీస్ 2 ఆశించిన విధంగా ఎంగేజింగ్ గా అయితే లేదు.బాగా బోర్ కొట్టించింది.ఓటీటీ కంటెంట్ కాబట్టి.

పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు హ్యాపీగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుని చూసేయొచ్చు.అంతకు మించి మెసేజ్ వంటివి ఆశించి చూస్తే మాత్రం బుక్కైపోయినట్టే అని చెప్పాలి.

మొదటి దానితో పోలిస్తే సీక్వెల్ కొంత వరకు నిరాశని కల్గించిందనే చెప్పాలి.

తాజా వార్తలు