పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవీ ( Bro movie ) టీజర్ తాజాగా విడుదలైంది. పవన్ ( Pawan Kalyan ) అభిమానులకు కిక్కిచ్చేలా ఉన్న ఈ టీజర్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది.
అయితే ఈ టీజర్ స్టార్టింగ్ లో పూజా హెగ్డే ( Pooja Hegde )కు సంబంధించిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాడ్ కొన్ని సెకన్ల పాటు కనిపించింది.ఇది చూసిన నెటిజన్లు బ్రో మూవీ టీజర్ లో పూజా హెగ్డే అంటూ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
తాజాగా గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకున్న సంగతి తెలిసిందే.అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) ఆ మూవీ నుంచి తప్పించినా బ్రో మూవీ టీజర్ లో కనిపించే ఛాన్స్ పూజా హెగ్డేకు ఇచ్చారని కొంతమంది సెటైరికల్ గా కామెంట్లు చేస్తున్నారు.బ్రో మూవీ టీజర్ అనుకున్న సమయం కంటే దాదాపుగా రెండు గంటలు ఆలస్యంగా రిలీజ్ కాగా పూజా హెగ్డే యాడ్ ను యాడ్ చేయడానికే టీజర్ ను లేట్ గా రిలీజ్ చేశారని కొంతమంది చెబుతున్నారు.
మరోవైపు బ్రో మూవీ టీజర్ కు ఇప్పటివరకు 10 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.యూట్యూబ్ లో ఈ టీజర్ టాప్ లో నిలవడం గమనార్హం.యూట్యూబ్ లో ఈ టీజర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
బ్రో టీజర్ లో పవన్, సాయితేజ్ ( Sai Dharam Tej ) లను హైలెట్ చేయడం గమనార్హం.పవన్ ఈ సినిమాకు 50 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం.
సాయితేజ్ ఈ సినిమాకు 10 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకున్నారని సమాచారం అందుతోంది.బ్రో మూవీ జులై 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
బ్రో మూవీ కమర్షియల్ గా హిట్ గా నిలవడం గ్యారంటీ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.బ్రో మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.