వైరల్ వీడియో: కాకులు ఆహారం కోసం ఇలా కూడా చేస్తాయా..?!

మనుషులు పారిశుధ్య పనులు చేయడం మీరు చూసే ఉంటారు.

మన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా చేసేందుకు మనుషులతో పాటు కొన్ని రకాల యంత్రాలను కూడా ఉపయోగిస్తూ ఉంటాము.

అయితే మీరు ఎప్పుడన్నా మనుషులు., యంత్రాలు చేసే పారిశుధ్య పనులను కాకులు చేయడం ఎప్పుడన్నా వినడం గాని, చూడడం గాని చేశారా.

లేదు కదా.వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నాగాని నిజంగానే కాకులు పారిశుధ్య పనులు చేస్తూన్నాయి.అలా కాకులు పారిశుధ్య పనులు చేసినందుకు గాని వాటికి ప్రతిఫలంగా తిరిగి ఆహారం కూడా లభిస్తుంది.

అసలు వివరాల్లోకి వెళితే కాకులు ఎంత తెలివిగా ఆలోచిస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మన చిన్నప్పుడు కాకి కథ గురించి మన అందరికి తెలిసిందే.బాగా దాహంతో ఉన్న కాకి కుండలో అడుగున ఉన్న నీళ్లను పైకి రప్పించడం కోసం ఆ కుండలో గులకరాళ్లు తెచ్చి వేసింది.

Advertisement

దీంతో కుండలో అడుగున ఉన్న నీళ్లు పైకి వస్తాయి.అలా పైకి వచ్చిన నీటిని తాగి కాకి తన దాహాన్ని తీర్చుకుంటుంది.

సరిగ్గా ఇలాగే కొన్ని కాకులు కూడా పారిశుధ్య పనులు చేసి తమ ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి.అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కార్విడ్ క్లీనింగ్ అనే స్టార్టప్ సంస్థకు ఒక కత్తి లాంటి ఐడియా వచ్చింది.కాకి తెలివికి మనిషి మేధాశక్తిని జతచేసి ఒక ప్రయాగం తలపెట్టారు.

ఇందులో భాగంగా కాకులకు ఒక ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చారు.మనుషుల్లగా క్లీనింగ్ పనులు చేయడంలో ట్రైనింగ్ ఇచ్చారు.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వైరల్: కోతులు కొట్లాటకు ఆగిపోయిన రైళ్లు!

అది ఏంటంటే రోడ్డు మీద స్మోకింగ్ చేసి పడేసిన సిగరెట్ బట్స్ తీసుకుని వచ్చేలాగా కాకులకు ట్రైనింగ్ ఇచ్చారు.

Advertisement

అలా తీసుకుని వచ్చిన సిగరెట్ బడ్స్ ను ప్రత్యేకంగా తయారు చేసిన ఓ రంథ్రంలో వేయాలి.అలా ఆ బట్స్ ఆ రంథ్రంలో వేయగానే పక్కనే ఉన్న మరో పరికరం నుంచి కాకికి కావలిసిన ఆహారం బయటకు వస్తుంది.అంటే ఎన్ని సిగరెట్ బడ్స్ ఆ మెషీన్ లో వేస్తే అంత ఆహారం కాకులకు వస్తుందన్నమాట.

కాకులు కూడా ఈ విషయంలో బాగానే ట్రైనింగ్ తీసుకున్నాయి.

ఇదిలా ఉండగా స్వీడన్‌లో ఏర్పడుతున్న చెత్తలో 60% పైగా సిగరెట్ బట్స్ ఉండడంతో కాలుష్యం పెరిగి పోతుంది.రోడ్లపై వీటిని పడేయోద్దని ఎన్ని సార్లు మున్సిపల్ సిబ్బంది చెప్పినాగాని మాట వినడం లేదు.అందుకే ఈ స్టార్టప్ సంస్థ కాకుల ద్వారా ఇలాంటి ఆలోచన చేసింది.

అందుకు ప్రతి ఫలంగా వాటికి ఆహారాన్ని ఇస్తుంది.ఈ సంస్థకు Sweden Tidy Foundation ఆర్థిక సహాకారం అందచేస్తుంది.

తాజా వార్తలు