సుకుమార్ తో సినిమా.. క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ!

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం లైగర్.ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది.

అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేసింది.ఈ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు.

అలాగే బాలీవుడ్ బ్యూటీ ముద్దుగుమ్మ అనన్య పాండే కూడా ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానుంది.అయితే విజయ్ దేవరకొండ లైగర్ సినిమాకు ముందు రెండు సినిమాలు కమిట్ అయ్యాడు.

Advertisement
Hero Vijay Devarakonda About Sukumar Movie, Sukumar,Vijay Devarakonda,Vijay Deva

అందులో ఒక సినిమా శివ నిర్వాణాతో మొదలు కూడా పెట్టేశాడు.ఈ సినిమా కంటే ముందుగా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

అంతేకాకుండా సినిమా రాబోతున్నట్లు అనౌన్స్ కూడా చేశారు.కానీ ఆ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ ఇప్పటివరకు లేదు.

ఆ సినిమాకు సంబంధించిన వార్తలు మాటే వినపడటం లేదు.

Hero Vijay Devarakonda About Sukumar Movie, Sukumar,vijay Devarakonda,vijay Deva

సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా అంటూ గతంలోనే ప్రకటన వచ్చింది.ఫాల్క‌న్ క్రియేష‌న్స్ లో ఆ సినిమాను నిర్మించ‌నున‌ట్లు 2020 లోనే ప్ర‌క‌టించారు.కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఆ సినిమా పై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

దాంతో సినిమా ఆగిపోయింది అని అందరూ అనుకున్నారు.ఇదే విషయం పై తాజాగా విజ‌య్ స్పందించాడు.

Advertisement

సుకుమార్‌తో సినిమా లేట్ అవుతుంది.అది నిజమే.

కాని ఈ సినిమా ఆగిపోలేదు.దానికి కాస్త స‌మ‌యం ప‌డుతుందది అని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.

అంతేకాకుండా సుక‌మార్ ప్ర‌స్తుతం పుష్ఫ‌ 2 సినిమాతో బిజీగా ఉన్నారు.ఆ సినిమా పూర్తి కాగానే త‌మ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది అని క్లారిటీ ఇచ్చాడు విజయ్.

తాజా వార్తలు