జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.ఒకపక్క జనసేన కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూనే, మరోపక్క తమ రాజకీయ ప్రధాన ప్రత్యర్థి వైసీపీ పైన, ఆ పార్టీ అధినేత జగన్ పైన తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
రాబోయే ఎన్నికల్లో జనసేన ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో పవన్ ఉన్నారు.అదే సమయంలో పొత్తుల విషయంలోనూ ఒక క్లారిటీతో ఉన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా కవులు రైతు భరోసా యాత్రలో భాగంగా జగన్ సొంత జిల్లా కడపలో పవన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులకు చెక్కులు అందజేసిన పవన్ కళ్యాణ్ అనంతరం వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు.” ఒక బిజినెస్ మ్యాన్ నుంచి ఒక భవన నిర్మాణ కార్మికుడు దాకా , ఒక సామాన్యుడు నుంచి చిరంజీవి దాకా చేతులు కట్టుకుని ఉండాలి.మాకు ఎదురు తిరిగితే ఎంత పెద్ద మెగా స్టార్ అయినా కూర్చోబెడతాం అనే ఆలోచనా ధోరణి నాకు నచ్చలేదు.
కొన్ని కోట్లమంది ఆరాధించే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేసులో ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారిని సీఎం కు దణ్ణం పెట్టే పరిస్థితికి తీసుకు వచ్చారంటే ఎంత ఆధిపత్య ధోరణి ఉందో అర్థం చేసుకోవచ్చు ” అంటూ పవన్ మండిపడ్డారు.జగన్ చిరంజీవిల వ్యవహారంపై తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత కొంతకాలంగా చూసుకుంటే, సీఎం జగన్ చిరంజీవి అనేకసార్లు భేటీ అయ్యారు.

సినీ పరిశ్రమకు చెందిన వివిధ సమస్యలను చిరంజీవి జగన్ వద్దకు వెళ్లి ప్రస్తావించగా, దానికి జగన్ సానుకూలంగా స్పందించారు.అనేక సందర్భాల్లోనూ జగన్ పొగుడుతూ చిరంజీవి వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాల ద్వారా పవన్ జనాల్లోకి వెళ్తున్నా, రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నా, ఎప్పుడూ పవన్ గురించి చిరంజీవి ప్రస్తావించలేదు.
కానీ జగన్ పైన , ఆయన పరిపాలన తీరు పైనా చిరంజీవి ప్రశంసలు కురిపించడం, చిరంజీవికి అంతే స్థాయిలో జగన్ గౌరవ, మర్యాదలు ఇవ్వడం వంటి సంఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో అసంతృప్తితోనే ఉంటూ వస్తున్నారు.తాజాగా చిరంజీవిని కావాలని జగన్ అవమానిస్తున్నారంటూ పవన్ వ్యాఖ్యానించడంపై వైసిపి నాయకులు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు.
దీనిపై చిరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ?







