బాలయ్య రియల్ క్యారెక్టర్ ఇదే.. చిన్నారి పేరు పెట్టి పిలిచిన వెంటనే ఏం చేశారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ పైకి గంభీరంగా కనిపించినా ఆయన మనస్తత్వం విషయంలో చిన్న పిల్లాడు అని అయనతో పని చేసిన వారు అభిప్రాయం వ్యక్తం చేస్తారనే సంగతి తెలిసిందే.

అన్ స్టాపబుల్ సీజన్2 గెస్ట్ ల విషయంలో విమర్శలు వినిపించడంతో ఈ షోకు ప్రభాస్, పవన్ కళ్యాణ్ గెస్ట్ లుగా హాజరయ్యేలా ఈ షో నిర్వాహకులు ప్లాన్ చేయడం జరిగింది.

ఈ రెండు ఎపిసోడ్ లు ఆహా ఓటీటీకే హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం అందుతోంది.బాలయ్య ప్రభాస్ కాంబో ఎపిసోడ్ మరో రెండు రోజుల్లో ప్రసారం కానుండగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో డార్లింగ్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ఈ తరహా టాక్ షోలలో పాల్గొనడం చాలా అరుదుగా జరుగుతుందనే సంగతి తెలిసిందే.

అయితే తాజాగా బాలయ్య పవన్ కాంబో ఎపిసోడ్ షూట్ జరుగుతుండగా ఆ సమయంలో అరుదైన ఘటన చోటు చేసుకోగా ఆ ఘటన హాట్ టాపిక్ అవుతోంది.బాలయ్య రియల్ క్యారెక్టర్ ఇదేనంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

ఒక చిన్నారి బాలయ్యను పేరు పెట్టి పిలవగా అలా పేరు పెట్టి పిలవడంతో షాకైన బాలకృష్ణ ఆ చిన్నారిని పిలిచి ప్రేమగా ముద్దాడారని సమాచారం.ఫ్యాన్స్ తప్పు చేస్తే కొన్ని సందర్భాల్లో కోపాన్ని ప్రదర్శించే బాలయ్య ఫ్యాన్స్ పై ప్రేమను కురిపిస్తే కూడా ఆ ప్రేమ మామూలుగా ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Star Hero Balakrishna Real Character Details Here Goes Viral , Star Hero Balakr
Advertisement
Star Hero Balakrishna Real Character Details Here Goes Viral , Star Hero Balakr

బాలయ్యకు బాలయ్యే సాటి అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.వీరసింహారెడ్డితో కూడా సక్సెస్ ను సొంతం చేసుకుంటే మాత్రం బాలయ్య దూకుడుకు బ్రేకులు వెయ్యడం సాధ్యం కాదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.బాలయ్య అనిల్ కాంబో మూవీ షూట్ ఇప్పటికే మొదలు కాగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అతి త్వరలో బాలయ్య అనిల్ కాంబో మూవీకి సంబంధించి ఏదైనా ఆసక్తికర అప్ డేట్ వస్తుందేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు