Srividya: నన్ను మోసం చేసిన వ్యక్తికి అమ్మగా నటించాను : శ్రీవిద్య చివరి మాటలు

సీనియర్ నటి శ్రీవిద్య( Actress Srividya ) గురించి స్పెషల్‌గా పరిచయం అక్కర్లేదు.40 ఏళ్ల కెరీర్‌లో 800కు పైగా సినిమాల్లో నటించి ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది.

మలయాళం, తమిళంతో పాటు తెలుగు, కన్నడ చిత్రాల్లోనూ నటించి ఎంతగానో మెప్పించారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంద్రుడు చంద్రుడు, బాలరామ కృష్ణులు, ముగ్గురు మొనగాళ్లు తదితర సినిమాల్లో నటించి అలరించారు.అయితే ఈమె నడి వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి తీరని లోటును మిగిల్చారు.2006లో 53 ఏళ్ల వయసులో మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్( Metastatic Breast Cancer ) వల్ల ఆమె కన్ను మూశారు.అయితే శ్రీవిద్య 2006లో క్యాన్సర్‌తో మరణించే ముందు ఓ మలయాళ ఛానెల్ ఇంటర్వ్యూలో తన జీవితం గురించి మాట్లాడారు.

ఒక స్టార్ హీరోని నమ్మి ప్రేమలో మోసపోయిన తన అనుభవాన్ని పంచుకున్నారు.తనని దారుణంగా మోసం చేసిన సదరు హీరోని క్షమించడం తనకు ఎలా సాధ్యమైందో వివరించారు.

శ్రీవిద్య 22 ఏళ్ల వయస్సులో ఓ స్టార్ హీరోతో లవ్ లో పడ్డారు.అతను మరెవరో కాదు కమల్‌ హాసన్.( Kamal Haasan ) వారు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు, కానీ అతను చివరికి మరొక మహిళతో సంబంధం పెట్టుకున్నాడని తెలిసి ఆమె గుండె పగిలారు.

Srividya Last Words About Her Life
Advertisement
Srividya Last Words About Her Life-Srividya: నన్ను మోసం చ�

అప్పటికీ ఆమెకు పెద్దగా మెచ్యూరిటీ లేదట.అందుకే ఆ సమయంలో బాధపడ్డానని, అదే ఈ సమయంలోనైతే ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకొని ఉండేదాన్ని ఆమె పేర్కొన్నారు.ఆ సమయంలో పరిపక్వత లేకపోయినా క్షమాగుణం తనకు చాలా అధికంగా ఉందని, తనను మోసం చేసిన వ్యక్తిని సింపుల్‌గా క్షమించేసానని చెప్పుకొచ్చారు.

శ్రీవిద్య తన మోసగాడిని క్షమించడం ఎలా సాధ్యమైందో వివరిస్తూ, "క్షమించడం నాకు సులభమైన విషయం కాదు.

Srividya Last Words About Her Life

నేనొక విషయం కూడా అర్థం చేసుకున్నాను, మోసపోవడం ఒక మానవ లక్షణం.ఎవరూ పరిపూర్ణులు కాదు.మీరు మిమ్మల్ని గాయపరచిన వ్యక్తిని క్షమించలేకపోతే, మీరు మీరే గాయపరుచుకుంటారు.

ఎవరినైనా క్షమించగల సామర్థ్యాన్ని నాకు దేవుడు ప్రసాదించాడు.అప్పట్లో ఎవరైతే నన్ను మోసం చేశారో అతనికే నేను తల్లిగా( Mother Role ) యాక్ట్ చేశాను.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

అదొక ప్రొఫెషనలిజం. అయినా అంతగా మోసం చేసిన వ్యక్తిని ఎలా క్షమించావు అని ఎవరైనా అడిగితే అదొక దైవం గృహం అని చెప్తాను." అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు