ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర క్రీడా అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆనుమతితో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఉద్యోగులకు తెలియచేయునది ఏమనగా, భారత ప్రభుత్వం 2024-25 సంవత్సరంనకు గాను అఖిల భారత సివిల్ సర్విసెస్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నది.ఇట్టి పోటీలలో పాల్గొనుటకు కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే అర్హులు.

కావున రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనుటకు, సిఫారసు చేయుటకు తేది: 21-01-2025 వ తారీఖు సాయంత్రం 5.00 గంటల వరకు ఈ క్రింద తెలుపబడిన ఆటలలో జిల్లా స్థాయిలో నైపుణ్యత గల ఉత్సాహవంతులైన ప్రభుత్వ ఉద్యోగ క్రీడాకారుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.1.అథ్లెటిక్స్(పు/స్త్రీ),2.క్రికెట్(పు),3.చెస్(పు/స్త్రీ),4.క్యారమ్స్(పు/స్త్రీ),5.హాకీ(పు/స్త్రీ), 6.పవర్ లిఫ్ట్టింగ్(పు/స్త్రీ), 7.స్విమ్మింగ్(పు/స్త్రీ), 8.టేబుల్ టెన్నిస్(పు/స్త్రీ), 9.వాలి బాల్(పు/స్త్రీ), 10.వెయిట్ లిఫ్ట్టింగ్(పు/స్త్రీ),11.రెజ్లింగ్ & గ్రీకో రోమన్ (పు),12.బెస్ట్ ఫిజిక్ (పు).13.ఖో – ఖో (పు), మరియు 14.యోగ (పు).కావున ఆసక్తి గల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్ధులు తేది:21-01-2025 రోజున సాయంత్రం 5.00 గంIIల లోపు జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి కార్యాలయములో తమ తమ పేర్లు నమోదు చేసుకోవలసినదిగా కోరనైనది.మరియు ఇట్టి ఎంపికలకు హాజరు అయ్యే వారికీ ఎలాంటి TA మరియు DA లు చెల్లించబడవు అని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఎ.రాందాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

Sports Competitions For Government Employees, Sports Competitions ,government Em

Latest Rajanna Sircilla News