ఎల్లారెడ్డిపేటలో నెలకొన్న కరెంట్ సమస్యలు తీర్చండి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో నెలకొన్న కరెంట్ సమస్యలను తీర్చాలని కోరుతూ సిరిసిల్ల సెస్ కార్యాలయంలో శనివారం స్థానిక మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ సెస్ అధికారులకు పిర్యాదు చేశారు.

ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టంపల్లి లో లో ఓల్టేజ్ కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వీటిని తీర్చాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పంట పొలాల్లో ఉన్న విద్యుత్ స్తంభాలు వంగిపోయి ఎప్పుడూ ఎవరి మీద పడతాయో అర్థం కావడం లేదని అన్నారు.గ్రామము లోని ట్రాన్స్ఫార్మర్ ఎస్ ఎస్ నంబర్ (30) నుండి ఎండి జలీల్ ఇంటి వరకు,ఇందిరమ్మ కాలనీ లో సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరా అవుతుందనీ దీంతో ఫ్యాన్లు,కూలర్ లు కాలిపోతున్నాయని త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని కోరారు.

అదే విధంగా అంబేద్కర్ నగర్ కాలనీలో ఇంప్రూవ్ మెంట్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసిన అట్టి పనులు ప్రారంభించకపోవడంతో లో ఓల్టేజ్ కారణంగా ఫ్యాన్లు,కూలర్ లు కాళిపోతున్నాయని ఇట్టి పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు.ఎల్లారెడ్డి పేటలో 6000 గృహ అవసరాల కనెక్షన్ లకు ఒక్కడే హెల్పర్ ఉన్నాడని మరో హెల్పర్ ను నియమించాలని,కిష్టం పల్లి లో అలంకార ప్రాయంగా మారిన ట్రాన్స్ఫార్మర్ పై ఇంప్రూవ్ మెంట్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసి లో ఓల్టేజ్ విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరారు.

వ్యవసాయ పొలాలకు సంబంధించి అదనంగా హెల్పర్ ను నియమించాలని సిరిసిల్ల సెస్ కార్యాలయంలో అందించిన పిర్యాదు లో పేర్కొన్నారు.

Advertisement
Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...

Latest Rajanna Sircilla News