విమానంలో ఉల్లిపాయలు తెచ్చుకున్న విమానా సిబ్బందిపై స్మగ్లింగ్ కేసు.. ఎందుకంటే..

సాధారణంగా విమానంలో బంగారం, మాదక ద్రవ్యాలతో ప్రయాణిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఏ ఎయిర్ పోర్ట్ లో అయినా వీటిని తీసుకుని ప్రయాణించిన ప్రయాణికున్ని అరెస్టు చేస్తారు.

కానీ ఆశ్చర్యమేమిటంటే ఉల్లిపాయలను విమానంలో తరలించిన ఫిలిప్పీన్స్ ఎయిర్ లైన్స్ ఎయిర్ హోస్టస్ పై స్మగ్లింగ్ కేసు నమోదు చేసింది.

స్వదేశంలో ఉల్లిపాయల ధరలు అధికంగా ఉండడంతో గల్ఫ్ లో చౌకగా లభిస్తున్న ఉల్లిపాయలను స్వదేశానికి తీసుకెళ్ళేందుకు ప్రయత్నించి స్మగ్లింగ్ కేసులో ఇరుక్కుంది.గల్ఫ్ లోని రియాద్ ,దుబాయ్ నగరాల నుండి ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా కు ఉల్లిపాయలు, నిమ్మకాయలతో పాటు కొన్ని పండ్లను తీసుకొచ్చినందుకు కష్టం అధికారులు ఫిలిప్పీన్స్ ఎయిర్ లైన్స్ ఎయిర్‌ హోస్టస్‌ పై ఇతర సిబ్బంది పై కేసు నమోదు చేసింది.

మాంసం, చికెన్ ధరల కంటే ఉల్లిపాయ ధరలే ఎక్కువగా ఉండడంతో గల్ఫ్ దేశాలలో లభించే భారత, యమాన్ దేశాల ఉల్లిపాయలను ఫిలిప్పీన్స్ ప్రవాస ప్రజలు పెద్ద సంఖ్యలో వారి దేశానికి తీసుకెళ్తూ ఉంటారు.భారీ జీతాలు అందుకునే విమానా సిబ్బంది కూడా ఇందుకు మినహాయింపు కాదు.

దుబాయ్ లో రెండున్నర దిర్హాంల కు లభించే ఉల్లిపాయలకు ఫిలిప్స్ ఇంట్లో 40 దిర్హాంలు చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

వరదల కారణంగా ఉల్లి పంట ధ్వంసం కావడంతో అక్కడ ధరలు భారీగా పెరిగిపోయాయి.దీని వల్ల యావత్ దేశంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని ఫిలిప్పీన్స్ ప్రవాస ప్రజలు స్వదేశానికి వెళ్లేటప్పుడు విలువైన బహుమతులకు బదులుగా ఉల్లిపాయలను వెంట తీసుకెళ్తున్నారు.

అయితే కస్టమ్స్ అధికారులు మాత్రం ఉల్లిగడ్డ ల స్మగ్లింగ్ ను అరికట్టేందుకు తీవ్రమైన కసురత్తులలో భాగంగా స్మగ్లింగ్ కేసులను నమోదు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు