అలోవెర ఆయిల్‌.. అందాన్నే కాదు జుట్టును కూడా సంర‌క్షిస్తుంది!

అలోవెర లేదా క‌ల‌బంద‌.దీని గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది.

క‌ల‌బంద‌లో చెప్ప‌లేన‌న్ని ఎన్నో అమోఘ‌మైన పోష‌కాలు, ఔష‌ధ గుణాలు నిండి ఉంటాయి.

అవి ఆరోగ్య ప‌రంగా, సౌంద‌ర్య ప‌రంగానే కాకుండా జుట్టు సంర‌క్ష‌ణ‌కు కూడా ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి.

ముఖ్యంగా అలోవెర‌తో ఆయిల్‌ను త‌యారు చేసుకుని వాడితే అందాన్ని రెట్టింపు చేసుకోవ‌చ్చు.అదే స‌మ‌యంలో జుట్టును ఒత్తుగా, పొడ‌వుగా కూడా పెంచుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అలోవెర ఆయిల్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో చూసేయండి.ముందుగా రెండు క‌ల‌బంద ఆకుల‌ను తీసుకుని వాట‌ర్‌లో శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా ఆర‌బెట్టుకోవాలి.

Advertisement

ఆ త‌ర్వాత సైడ్స్‌ను తొల‌గించి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఈ ముక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక‌టిన్న‌ర గ్లాస్ కొబ్బ‌రి నూనెను పోయాలి.నూనె కాస్త హీట్ అవ్వ‌గానే అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న అలోవెర మిశ్ర‌మాన్ని వేసి ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించాలి.

ఆపై స్ట‌వ్ ఆఫ్ చేసుకుని ఆయిల్‌ను చ‌ల్లార‌బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక.

స్ట్రైన‌ర్ సాయంతో ఆయిల్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఈ అలోవెర ఆయిల్ ను జుట్టుకే కాదు చ‌ర్మానికి కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

జుట్టుకు ఈ ఆయిల్‌ను నైట్ నిద్రించే ముందు అప్లై చేసుకుని.ఉద‌యాన్నే మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది.

Advertisement

చుండ్రు స‌మ‌స్య పోతుంది.కేశాలు సిల్కీగా మార‌తాయి.

అలాగే ఈ ఆయిల్‌తో రోజుకు ఒక‌సారి ముఖాన్ని మ‌సాజ్ చేసుకుంటే.చ‌ర్మం మృదువుగా త‌యార‌వుతుంది.

మొటిమ‌లు, మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి.డ్రై స్కిన్ స‌మ‌స్య నుండి విముక్తి సైతం ల‌భిస్తుంది.

తాజా వార్తలు