బిగ్ బాస్ 2 పై సింగర్ మధుప్రియ సంచలన కామెంట్స్..! మీరు ఒప్పుకుంటారా.? లేక తిడతారా.?

ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని అంటూ పన్నేండేళ్ల వయసులో తను పాడిన పాట ప్రతి ఒక్కరి మదిని తాకింది.

అప్పటినుండి అందరూ ఆ పిల్ల మా ఇంటి పిల్ల అని గర్వంగా చెప్పుకున్నారు.

తనే మధుప్రియ.నా పాలిట అమ్మానాన్నలే విలన్లు అంటూ కనిపెంచిన అమ్మానాన్నల్ని కాదని ప్రేమించిన వాడి చేయ్ పట్టుకుని వెళ్లిపోయినప్పుడు అందరూ ద్వేషించారు.

మా ఇంటి పిల్లే ఇలా చేసిందా అని ప్రేమతో కూడిన ద్వేషం అది.ప్రేమ,పెళ్లి ఘటనల తర్వాత మధుప్రియకు ఆల్మోస్ట్ అవకాశాలు తగ్గిపోయాయి.ప్రేక్షకులు కూడా తనని పట్టించుకోవడం మానేశారు.

కొన్నేండ్ల తర్వాత వచ్చిండే మెల్లా మెల్లగా వచ్చిండే అంటూ మనందరి ముందుకు వచ్చింది.చిన్నా,పెద్దా,ముసలి ,ముతక అందరిని తన గళంతో అలరించింది.

Advertisement

మధు ప్రియ గాత్రానికి తగ్గట్టు సాయిపల్లవి డ్యాన్స్ ఆ పాటకు మరింత క్రేజ్ ని తెచ్చిపెట్టాయి.అందరూ మధు ప్రియకు ఫిదా అయ్యారు.

బిగ్ బాస్ మొదటి సీజన్లో మధుప్రియ పెర్ఫార్మన్స్ ని ఎలా ట్రోల్ చేసారో అందరికి తెలిసిందే.టాప్ తిప్పితే నీళ్లు వచ్చినట్టు.కంటి కుళాయి తిప్పేసి పాతాల గంగ మధుప్రియ.

అయితే ప్రస్తుతం నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రెండో సీజన్ పై మధుప్రియ కామెంట్స్ చేసింది.ఇటీవల ఇంటర్వ్యూలో ఏమంది అంటే.

బిగ్ బాస్ మొదలైన మూడు రోజులే అయింది కాబట్టి అప్పుడే ఎవరినీ పాయింట్ ఔట్ చేయలేము.అందులో నాని ఒకే రోజు కనిపించారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
Hair winter : వింటర్ లో ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవాల్సిందే.. మిస్ అయితే చాలా నష్టపోతారు!

అప్పుడే ఆయన బాగా చేస్తున్నారా? లేదా? అనేది జడ్జ్ చేయలేం.తారక్ అన్న అద్భుతంగా చేశాడు అనేది ఎవరూ కాదనలేని విషయం అని మధు ప్రియ వ్యాఖ్యానించారు.

Advertisement

ఇప్పుడున్న కంటెస్టెంట్స్ బాగానే ఉన్నారనేది నా ఫీలింగ్.వాళ్లు ఎంత ఎంటర్టెన్మెంట్స్ అందిస్తారు అనేది మున్ముందు తెలుస్తుంది.

మొదటి సీజన్లో ఉన్నవారు రాకింగ్ ఎంటర్టెన్మెంట్ అందించారనేది అందరికీ తెలిసిందే.ఆట, పాట, మాటల పరంగా ఆకట్టుకన్నారు, రెండో సీజన్ కంటెస్టెంట్ల గురించి కొన్ని రోజులు గడిస్తేకానీ చెప్పలేమని మధు ప్రియ అన్నారు.

ఈ సారి బిగ్ బాస్ 2లో ఇంకాస్త గరం మసాలా ఉంటుందని చెప్పారు.ఇప్పటి వరకైతే అలాంటి మసాలా ఏమీ కనిపించలేదు.

ఇప్పుడే షో మొదలైంది కాబట్టి అప్పుడే జడ్జ్ చేయలేం.ఇకపై ఉండబోతోంది ఏమో చూడాలి అని వ్యాఖ్యానించారు.

బిగ్ బాస్ మొదటి సీజన్‌కు, రెండో సీజన్ కు చాలా తేడాలు ఉన్నాయి.అప్పుడున్న ఎన్టీఆర్ అన్నతో పాటు కంటెస్టెంట్స్ అందరూ మారిపోయారు.

రెండో సీజన్లో ఇంటితో పాటు అంతా కొత్తగా రెడీ అయింది.ఎన్టీఆర్ అన్న ఇపుడు లేక పోవడం బాధాకరం.

బిగ్ బాస్ 2 లో ఎన్టీఆర్ అన్నను మిస్సవుతున్నాం.ఆయన ఈసారి చేయక పోవడానికి కారణం ఏమిటో మనకు తెలియదు కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అని మధు ప్రియ తెలిపారు.

ఎన్టీఆర్ అన్న చాలా నేచురల్ గా, మన ఇంట్లో జోవియల్ గా ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడేవారు.నేను అన్నయ్య అనడం, ఆయన చెల్లమ్మా అంటూ పిలకరించడం సంతోషంగా ఉండేది.

సీజన్ 2లో నేను లేను కాబట్టి నాని గురించి నేను ఎక్కువగా చెప్పలేక పోతున్నాను.నాని గారుకూడా మంచి టాలెంట్ ఉన్న యాక్టర్.

ఆయన మున్ముందు షోను మరింత అద్భుతంగా ముందుకు నడుపుతారని అనుకుంటున్నాను అని మధు ప్రియ తెలిపారు.

తాజా వార్తలు