కరోనాతో విషాదం: సింగపూర్‌లో భర్త మృతి, విశాఖలో భార్య... వాట్పాప్‌లో అంత్యక్రియల వీడియో

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు గాను ప్రపంచంలోని అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను విధించడంతో పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేశాయి.

ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక, క్రీడా రంగాలు నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

దీంతో విద్య, ఉపాధి కోసం వివిధ దేశాలకు వెళ్లిన భారతీయుల కష్టాలు వర్ణనాతీతం.ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో లక్షలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు.

తమ వారి క్షేమ సమాచారం కోసం మనదేశంలో ఉన్న వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.ఇదే బాధ అనుకుంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం కానీ దేశంలో మరణించిన వారి ఆవేదన వర్ణనాతీతం.

అచ్చం అలాంటి పరిస్ధితినే ఎదుర్కొంటోంది విశాఖకు చెందిన ఓ కుటుంబం.జిల్లాలోని ఎస్.రాయవరం మండలం వమ్మవరం గ్రామానికి చెందిన వెలుగుల సూర్యారావు ఉపాది కోసం సింగపూర్‌కు వెళ్లి, అక్కడ వెల్డర్‌గా పనిచేస్తున్నాడు.

Advertisement

ఆదివారం డ్యూటీలో ఉండగానే సూర్యారావు మరణించినట్లు ఆయన పనిచేస్తున్న కంపెనీ ప్రతినిధి ఒకరు అతని భార్య శ్రావణికి సమాచారం ఇచ్చాడు.దీంతో ఆమె కుప్పకూలిపోయారు.తన భర్త ఎలా చనిపోయాడో కూడా తెలియదని, ప్రమాదమా.? లేక మరేదైనా కారణమా అనేది కంపెనీ చెప్పలేదని శ్రావణి తెలిపారు.ఇదే బాధ అనుకుంటే కరోనా వైరస్ కారణంగా విమాన రాకపోకలు నిలిచిపోవడంతో సూర్యారావు మృతదేహాన్ని భారతదేశానికి తరలించే దారులు మూసుకుపోయాయి.

దిక్కుతోచని స్థితిలో సింగపూర్‌లోనే ఉంటున్న సూర్యారావు స్నేహితులు, తోటి సిబ్బంది, తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.ఈ సమయంలో వాట్సాప్ ద్వారా వీడియో, ఫోటోలు తనకు పంపారని కనీసం భర్త చివరి చూపు కూడా లేకపోవడంతో శ్రావణి కన్నీటి పర్యంతమైంది.

కుటుంబం కోసం సింగపూర్ వెళ్లిన తన భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయవడంతో శ్రావణి బోరున విలపిస్తున్నారు.ఈ దంపతులకు ఓ పాప, బాబు ఉన్నారు, సూర్యారావు మరణంతో ఈ కుటుంబం రోడ్డుపై పడింది.

సిక్కు కమ్యూనిటీతో ప్రధాని నరేంద్ర మోడీది బలమైన బంధం : ఇండో అమెరికన్ నేత
Advertisement

తాజా వార్తలు