వేసవిలో మీ జుట్టు మరింత అధికంగా ఊడుతుందా.. వర్రీ వద్దు ఇలా చెక్ పెట్టండి!

హెయిర్ ఫాల్( Hair fall ) అనేది అందరిలోనూ కామన్ గా ఉండే సమస్య.అయితే ఒక్కో సమయంలో చాలా ఎక్కువగా జుట్టు రాలిపోతుంటుంది.

ఇలాంటి పరిస్థితిని ప్రస్తుత వేసవి కాలంలో ఎంతో మంది ఫేస్ చేస్తూ ఉంటారు.అధిక వేడి మరియు తేమ కారణంగా వేసవి కాలంలో కొందరి జుట్టు విపరీతంగా ఊడిపోతూ ఉంటుంది.

దీంతో ఏం చేయాలో తెలియక తెగ సతమతం అయిపోతుంటారు.మీరు కూడా ఈ లిస్టులో ఉన్నారా.? వేసవిలో మీ జుట్టు మరింత అధికంగా ఊడుతుందా.? వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను పాటిస్తే సులభంగా హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టవచ్చు.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా పండిన కొన్ని బొప్పాయి పండు ముక్కలు( Papaya ) వేసుకోవాలి.అలాగే రెండు రెబ్బలు కరివేపాకు, కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు మరియు వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.

ఈ సింపుల్ హెయిర్ మాస్క్ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.జుట్టును మూలాల నుంచి బలోపేతం చేస్తుంది.హెయిర్ ఫాల్ ను అరికడుతుంది.

వారానికి ఒకసారి ఈ హెయిర్ మాస్క్ ను కనుక వేసుకుంటే జుట్టు రాలడం దెబ్బకు కంట్రోల్ అవుతుంది.అలాగే వేసవి కాలంలో జుట్టు రాలకుండా ఉండటానికి మరిన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.

ముఖ్యంగా గోరు వెచ్చ‌ని ఆయిల్ తో రెండు రోజులకు ఒకసారి తలను మసాజ్ చేసుకోవాలి.ఇది జుట్టు కుదుళ్లను స్ట్రాంగ్ గా మారుస్తుంది.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

తలపై రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది.అలాగే వేసవిలో బయటకు వెళ్ళేటప్పుడు జుట్టుకు ఎండ తగలకుండా కవర్ చేసుకోవాలి.

Advertisement

మరియు వేసవిలో హెయిర్ స్టైలింగ్ టూల్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు