ఈ సింపుల్ ఫేస్ మాస్క్‌ను వాడితే ఇన్‌స్టంట్ ఫేస్ గ్లో మీసొంతం!

స‌డెన్‌గా ఏదైనా పార్టీకో, ఫంక్ష‌న్‌కో వెళ్లాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఇన్‌స్టంట్ ఫేస్ గ్లో కోసం తెగ తాప‌త్రాయ‌ప‌డుతుంటారు.

ఈ నేప‌థ్యంలోనే మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే ఫేస్ మాస్కుల‌ను తెచ్చుకుని యూజ్ చేస్తుంటారు.

వీటి వ‌ల్ల పెద్ద‌గా ప్ర‌యోజ‌నాలు ఉండ‌క‌పోవ‌చ్చు.కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ అండ్ సింపుల్ ఫేస్ మాస్క్‌ను వాడితే గ‌నుక క్ష‌ణాల్లో ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మెరిపించుకోవ‌చ్చు.

పైగా దీని కోసం వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టాల్సిన అవ‌స‌రం కూడా లేదు.మ‌రి ఇంకెందుకు లేటు ఈ ఫేస్ మాస్క్‌ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.

మొద‌ట‌ బాగా పండిన బొప్పాయి పండును తీసుకుని పైతొక్క‌, లోప‌లి గింజ‌లు తొల‌గించి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఈ బొప్పాయి ముక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి.

Advertisement
Simple Face Mask For Instant Glow! Face Mask, Instant Glow, Instant Face Glow, L

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వేపాకు పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ బొప్పాయి పేస్ట్‌, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె, మూడు చుక్క‌లు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్, వ‌న్ టేబుల్ స్పూన్‌ పెరుగు వేసుకుని అన్నీ క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

Simple Face Mask For Instant Glow Face Mask, Instant Glow, Instant Face Glow, L

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకుని.ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.ఆ త‌ర్వాత త‌డి చేతుల‌తో మెల్ల‌గా ముఖాన్ని ర‌బ్ చేసుకుంటూ కూల్ వాట‌ర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా చేస్తే గ‌నుక చ‌ర్మంపై పేరుకుపోయిన మ‌లినాలు, మృత క‌ణాలు తొల‌గిపోయి ముఖం అందంగా మ‌రియు ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.ఎప్పుడైనా పెళ్లికో లేదా ఫంక్ష‌న్‌కో లేదా పార్టీకో స‌డెన్‌గా వెళ్లాల్సి వ‌చ్చిన‌ప్పుడు పైన చెప్పిన ఫేస్ మాస్క్‌ను ట్రై చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు