దొంగలు నిర్మించిన ఈ శివుని ఆలయం గురించి తెలుసా.. ఇక్కడ స్వామిని ఏమని పిలుస్తారంటే?

హిందువులలో చాలామంది శివుడిని ఎంతో భక్తితో పూజిస్తారనే సంగతి తెలిసిందే.దేశంలోని ఎన్నో ముఖ్య ప్రాంతాలలో శివుడికి దేవాలయాలు ఉన్నాయి.

అయితే ఒక ఆలయంలో మాత్రం శివుడిని దొంగ మల్లన్న( Donga Mallanna ) అని పిలుస్తారు.ఈ ఆలయానికి దాదాపుగా 1000 సంవత్సరాల చరిత్ర ఉండగా ఈ ఆలయాన్ని దొంగలు నిర్మించారు.

ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో ఈ ఆలయంలోని శివుడిని భక్తులు ఎంతో భక్తితో పూజిస్తారు.ఈ ఆలయాన్ని సందర్శిస్తే కోరిన కోరికలు తీరతాయని భక్తులు భావిస్తారు.

ఇద్దరు దొంగలు( Two Thieves ) కేవలం ఒకే ఒక్క రాత్రిలో ఈ ఆలయాన్ని నిర్మించారు.జగిత్యాల జిల్లాలోని ( Jagityala )గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో ఈ ఆలయం ఉంది.

Advertisement
Significance Of Donga Mallanna Temple Details, Donga Mallanna, Donga Mallanna Sw

భక్తుల కోర్కెలను తీర్చే భోళా శంకరుడి ఆలయం దగ్గర నిర్వహించే జాతరను చూడటానికి రెండు కళ్లు చాలవు.ఇద్దరు దొంగలు ఒక ఊరిలో ఆవులను దొంగలించగా ఆ విషయం గ్రామస్తులకు తెలియకుండా తప్పించుకోగలిగితే గుడి కట్టిస్తామని దొంగలు శివ లింగాన్ని మొక్కుకున్నారు.

Significance Of Donga Mallanna Temple Details, Donga Mallanna, Donga Mallanna Sw

కొంత సమయానికి గ్రామస్తులు దొంగలు ఆవులను( Cows ) దొంగలించారని గుర్తించగా ఆ సమయంలో ఆవుల రంగు మారిపోవడంతో గ్రామస్తులు వెనక్కు వెళ్లిపోయారు.ఆ తర్వాత దొంగలు తమకు నచ్చిన రీతిలో ఆలయాన్ని( Temple ) నిర్మించారు.ఆ తర్వాత రోజుల్లో రాజులు ఆ ఆలయాన్ని అభివృద్ధి చేశారు.

స్వామికి బోనాలు సమర్పించి రంగవల్లికలు వేస్తే కోరిన కోరికలు తీరతాయని చాలామంది నమ్ముతారు.

Significance Of Donga Mallanna Temple Details, Donga Mallanna, Donga Mallanna Sw

కొండూరు వంశస్థుల ఆధ్వర్యంలో ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి.తెలంగా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి భక్తులు చేరుకుంటారు.జగిత్యాల పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.

విజిల్ పోడు.. పుష్ప ఎంట్రీతో అదరగొట్టిన జడ్డు భాయ్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి10, సోమవారం 2025

ఈ ఆలయంలో శివుడితో పాటు ఇతర దేవతామూర్తులను సందర్శించవచ్చు.ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉండగా కొత్త కుండలో కొత్త పంటతో బోనం చేసి పూజిస్తే కోరిన కోరికలు తీరతాయని చాలామంది విశ్వసిస్తారు.

Advertisement
" autoplay>

తాజా వార్తలు