ఈ ఏడాది శ్రావణ మాసం ఎప్పుడు వస్తుంది.. శ్రావణ మాసం విశిష్టత ఏమిటి?

హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు 12 నెలలు ఎంతో ప్రత్యేకమైనవి.ప్రతి నెల ఎంతో ప్రాముఖ్యత, ప్రత్యేకత నెలకొంది.

ఈ క్రమంలో తెలుగు మాసాలలో ఐదవ నెల అయినా శ్రావణమాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.శ్రావణమాసం హిందూ ప్రజలకు ఎంతో పవిత్రమైనవి ముఖ్యమైనదిగా భావిస్తారు.

ఈ శ్రావణ మాసం మొత్తం మహిళలు ముఖ్యంగా వివిధ రకాల పూజలు, నోములు, వ్రతాలతో ఎంతో బిజీగా ఉంటారు.శ్రావణ మాసంలో ఉపవాసాలు ఉంటూ అమ్మవారికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు.

మరికొందరు ఈ నెల మొత్తం ఎటువంటి మాంసాహారం తినకుండా భక్తిశ్రద్ధలతో ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు.మరి ఎంతో పరమపవిత్రమైన శ్రావణమాసం ఎప్పుడు వచ్చింది శ్రావణ మాసంలో ఉపవాసం ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను తెలుసుకుందాం.

Advertisement

ఈ ఏడాది శ్రావణమాసం 2021 ఆగస్టు 9వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.ఈ శ్రావణ మాసాన్ని నబో మాసం అని కూడా పిలుస్తారు.

నబో అంటే ఆకాశం అనే అర్థం వస్తుంది.ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో వచ్చే టువంటి సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారాలకు ఎంతో ప్రత్యేకత ఉంది.

ఈ రోజులలో భక్తులు పెద్దఎత్తున ఉపవాస దీక్షలో పాల్గొని స్వామి వారికి పూజలు నిర్వహిస్తుంటారు.

అదేవిధంగా శ్రావణమాసంలో లక్ష్మీదేవి విష్ణు మూర్తి పై అలిగి వైకుంఠ విడిచి పెట్టినది శ్రావణమాసంలోనేనని చెబుతారు.అలా వెళ్ళిన లక్ష్మీదేవి తిరిగి దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మధనం చేస్తున్న సమయంలో లక్ష్మీదేవి సముద్ర గర్భం నుంచి ఉద్భవించి అని పురాణాలు చెబుతున్నాయి.అయితే లక్ష్మీదేవి కన్నా ముందుగా సముద్రం నుంచి కాలకూట విషం బయటకు వచ్చింది.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
నాగార్జునకు ఆర్జీవీ అంటే ఎందుకు అంత ఇష్టం?

ఆ విషానికి అందరిని చంపేసే ప్రభావం ఉండటం వల్ల పరమేశ్వరుడు దానినే తన కంఠంలో బంధించాడని మనకు తెలిసిందే.అందుకే శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున ఉపవాసముండి భక్తులు ఆ పరమేశ్వరుని పూజిస్తారు.

Advertisement

ఉపవాస దీక్షలతో స్వామి వారిని పూజించడం,పార్వతీదేవికి కుంకుమ పూజ నిర్వహించడం వల్ల తమ పసుపు కుంకుమలు పదికాలాలపాటు చల్లగా ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు.అందుకే చాలా మంది మహిళలు ఈ నెలలో ఉపవాసంతో మంగళగౌరీవ్రత నిర్వహిస్తారు.

తాజా వార్తలు