జగన్ సీఎం అవ్వడం ఖాయం..తేల్చి చెప్పిన సర్వే

ఎన్నికలు దగ్గరపడుతున్నాయి.ఓ వైపు అన్ని పార్టీలు ఎవరి బలం ఎలా ఉంటుందో అంటూ తమ తమ వ్యక్తిగతంగా సర్వేలు చేయించుకుంటూ ఉంటాయి.

ఏపీలో సర్వేలు చేయించడంలో ఆరి తేరిన చంద్రబాబు ఇప్పటికే తన సర్వేల రిజల్ట్స్ తో తలపట్టుకుని నష్టనివారణ చర్యలు చేపడుతున్నారు అని తెలిస్తోంది.అయితే తాజాగా ఓ వార్తా సంస్థ చేసిన సర్వే.

టిడిపి పార్టీలో మరింత గుబులు రేపుతోంది.ప్రముఖ జర్నలిస్టు అర్నబ్ గోస్వామి ఆధ్వర్యంలోని జాతీయ న్యూస్ ఛానల్ రిపబ్లిక టివి దేశం మొత్తం మీద ఈమధ్యనే సర్వే జరిపింది.

ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఏ రాష్ట్రంలో ఎన్ని ఎంపి సీట్లు వస్తాయి? అన్న అంశం ప్రధానంగా సర్వే జరిపింది.అయితే వారు చేసిన సర్వేలో ఏపీ విషయాన్ని తీసుకుంటే ఆశ్చర్యకరమైన ఫలితాలని వెల్లడించింది.

Advertisement

ఏపీలో జగన్ కి మంచి ఆదరణ పెరిగిందని.చంద్రబాబు కి ఈ సారి ఎదురుగాలే అని అంటోంది ఈ సర్వే.

పాదయాత్ర చేపట్టిన సమయం నుంచీ జగన్ గ్రాఫ్ విపరీతంగా పెరిగిందని తెలుస్తోందని తెలిపింది ఈ సర్వే.అంతేకాదు ప్రభుత్వం పై అధికారుల నుంచీ సామాన్యుడి వరకూ వ్యతిరేకత పెరిగిపోయిందని,,మరొక్క సారి ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు కి మొండి చేయి చూపిస్తారు అని తెలిపింది ఈ సర్వే.

అసలు విషయానికి వస్తే సరే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసిపికి 13 ఎంపి సీట్లు ఖాయమట.పోయిన ఎన్నికల్లో వచ్చింది 8 మాత్రమే.

అదే సమయంలో మిత్రపక్షాలకు 12 సీట్లు మాత్రమే వస్తాయట.పోయిన ఎన్నికల్లో 17 సీట్లు గెలిచింది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
నేటి ఎన్నికల ప్రచారం: నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ .. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ అంటే ?

ఇదిలా ఉంటే.ఎంపీ స్థానాల్లో వైసీపే హవా సాగిస్తే ఆ పరిధిలో ఉండే ఎమ్మెల్యే స్థానాలలో కూడ వైసీపి విజయకేతనం ఎగరేయడం పెద్ద విషయం కాదు అనేది ఆ సర్వే తెలిపింది.

Advertisement

ఈ లెక్కలో చుస్తే జగన్ వచ్చే ఎన్నికల్లో సీఎం ఫీటం ఎక్కడం కచ్చితంగా జరుగుతుందని అంటోంది ఈ సర్వే.అంతేకాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఎంపీ సీట్ల వారీగా ఈ అధ్యయనం చేసిన సదరు సంస్థ ఏపీ ,తెలంగాణలో కూడా తన సర్వే ఫలితాలని వెల్లడించింది.

తెలంగాణలో తెరాస హవా ఎప్పుడు ఎన్నికలు జరిగినా చెక్కు చెదరదని తేల్చి చెప్పింది.తెలంగాణ రాష్ట్ర సమితి 11 ఎంపీ సీట్లను, భారతీయ జనతా పార్టీ మూడు సీట్లను సాధించుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు ఎంపీ సీట్లకు పరిమితం అవుతుందని కుండ బద్దలు కొట్టింది.

అయితే ఏపీలో మాత్రం ఈ పరిస్థితికి పూరి భిన్నంగా ఉంటుందని తెలిపింది.ఏపీలోని 25 ఎంపీ సీట్లకు ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపికి 13 ఎంపీ సీట్లను గెలుచుకోగలదని.

అధికార తెలుగుదేశం ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి 12 ఎంపీ సీట్లకు పరిమితం అవుతుందని ఈ సర్వే అంచనా వేసింది.అయితే ఏపీలో మాత్రం ఈ ఫలితాలలో మార్పులు కూడా జరగవచ్చు అని ఏపీ పరిస్థితి పూర్తిగా అన్ని రాష్ట్రాల కంటే చాలా కటినంగా ఉందని తెలిపింది ఈ సర్వే.

తాజా వార్తలు