Super star krishna: ఆ స్టూడియో గేటు దగ్గర కృష్ణను ఆపేసిన వాచ్ మెన్.. చివరకు?

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరినీ గౌరవిస్తారు.

ఎవరైనా పొరపాటున తన విషయంలో తప్పుగా ప్రవర్తించినా వాళ్లను క్షమించే జాలి గుణం సూపర్ స్టార్ కృష్ణకు ఉంది.

చాలా సంవత్సరాల క్రితం పద్మాలయ స్టూడియోస్ దగ్గర వాచ్ మెన్ కృష్ణగారిని గేటు దగ్గర ఆపేశారు.వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కృష్ణ గురించి తెలియకపోవడంతో ఆ వ్యక్తి అలా ప్రవర్తించారు.

వాచ్ మెన్ కు తెలుగు రాకపోవడం అదే సమయంలో ఆ వాచ్ మెన్ మాట్లాడే భాష కృష్ణకు రాకపోవడంతో ఈ సమస్య ఎదురైంది.సాధారణంగా వాచ్ మెన్ ఈ విధంగా ప్రవర్తిస్తే ఉద్యోగం నుంచి తొలగించడం లేదా మందలించడం జరుగుతుంది.

అయితే కృష్ణ మాత్రం ఆ వాచ్ మెన్ వర్క్ ను అభినందించారు.మేనేజర్ వాచ్ మెన్ కు కృష్ణగారి గురించి చెప్పి ఆయనను స్టూడియో లోపలికి తీసుకెళ్లారు.

Advertisement
Shocking Incident In Super Star Krishna Life Details, Krishna, Super Star Krishn

సూపర్ స్టార్ కృష్ణ జీవితంలో ఈ విధంగా చోటు చేసుకున్న ఎన్నో ఘటనలు ఉన్నాయి.ప్రతి సందర్భంలోనూ కృష్ణ అవతలి వ్యక్తులకు బెనిఫిట్ కలిగేలా తన వంతు సాయం చేసి మెప్పు పొందారు.

Shocking Incident In Super Star Krishna Life Details, Krishna, Super Star Krishn

పలు సినిమాలలో కృష్ణ గెస్ట్ రోల్స్ లో నటించి ఆ సినిమాల సక్సెస్ కు కారణమయ్యారు.ఏ సినిమాలో నటించినా ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.కృష్ణ చేసిన గుప్త దానాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు.

మరీ అంత మంచితనం పనికిరాదని చాలామంది కృష్ణకు సూచించినా మన దగ్గర ఉన్న డబ్బుతో అవతలి వ్యక్తుల కష్టాలు తీరితే చాలని కృష్ణ చెప్పేవారు.ఎవరైనా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిస్తే కృష్ణ వాళ్లకు ఆర్థికంగా సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు