షర్మిల రాజకీయం కాంగ్రెస్ కు కలిసిరావడం లేదా ? 

ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ కనీస ప్రభావం చూపించలేకపోతోంది.

ఏపీలో కాంగ్రెస్ (AP ,Congress)ఉనికి లేదన్నట్లు పరిస్థితి ఉంది .అయితే ఈ పరిస్థితిని మార్చేందుకు పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించి,  క్షేత్రస్థాయి నుంచి మరింత బలవపేతం చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం వైస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ (AP Congress ,YS Sharmila)అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది .షర్మిల దూకుడు రాజకీయం కాంగ్రెస్ కు కలిసి వస్తుందని ఎన్నో అంచనాలు పెట్టుకుంది.అయితే ఏపీ అసెంబ్లీ,  పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు.

షర్మిల సైతం ఓటమి చెందారు.అయితే ఆ ఎన్నికల్లో ఓటమి దగ్గర నుంచి షర్మిల చేస్తున్న రాజకీయం కాంగ్రెస్ కు ఏమాత్రం కలిసి రావడం లేదనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల్లో ఉన్నాయి.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి (President of AP Congress)హోదాలో అందరిని కలుపుకుని వెళ్లాల్సిన షర్మిల ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉండడం ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి కి కారణం అవుతుంది.  పార్టీ నేతలతో ఏ విషయాల పైనా మాట్లాడకపోవడం,  తాను అనుకున్న పని చేస్తూ తనకు ఇష్టం వచ్చినప్పుడు మీడియా సమావేశం నిర్వహించడం , లేకపోతే హైదరాబాద్ కి పరిమితం కావడంపై ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది.

Advertisement

అప్పుడప్పుడు ఏపీకి వచ్చి ప్రభుత్వం పై విమర్శలు చేయడంతో పాటు,  వైసిపిని టాబ్లెట్ చేసుకుని విమర్శలు.చేస్తూ , తర్వాత సైలెంట్ అయిపోవడం , పూర్తిగా వ్యక్తిగత వ్యవహారాలతోనే షర్మిల బిజీగా ఉండడం వంటివన్నీ కాంగ్రెస్ అధిష్టానానికి అసంతృప్తిని కలిగిస్తున్నాయట.

  కాంగ్రెస్ ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు షర్మిల(Sharmila) ఏమాత్రం దృష్టి పెట్టడం లేదనే అసంతృప్తి ఆ పార్టీ నేతల్లో ఉంది.కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు ఏదో ఒక పదవి వస్తుందని ఆశతోనే షర్మిల పిసిసి  అధ్యక్ష  బాధ్యతల్లో కొనసాగుతున్నారనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

అసలు షర్మిల ఏపీలో ఏ విధమైన రాజకీయం చేయాలనుకుంటున్నారు ? కాంగ్రెస్ ను బలోపేతం చేసే ఉద్దేశం ఉందా లేక తన అన్న జగన్ (YS Jagan) ను టార్గెట్ చేయడం కోసమే పని చేస్తున్నారా అనే అనుమానాలు కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.  మొన్నటి ఎన్నికల్లో వైసీపీనీ , జగన్ (YCP, Jagan)ను టాబ్లెట్ చేసుకున్నా,  కాంగ్రెస్ కు ఒక స్థానం కూడా దక్కలేదు.  షర్మిల సైతం ఓటమి చెందారు.

వైసిపి ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్ళించే విషయంలోనూ షర్మిల సక్సెస్ కాలేదు.ఇప్పటికే షర్మిల వ్యవహారంపై కొంతమంది కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.

నాకు గ్రీన్ కార్డ్ దక్కుతుందా .. భారత సంతతి సీఈవో ఆందోళన, ఎలాన్ మస్క్ రియాక్షన్
Advertisement

తాజా వార్తలు