సొంత గ్రామంలో ఉన్న ఇంటిని హోమ్ టూర్ చేసిన శాంతి స్వరూప్.. వీడియో వైరల్!

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో శాంతి స్వరూప్ ఒకరు.

హైపర్ ఆది టీం లో లేడీ గెటప్స్ ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న శాంతి స్వరూప్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.ఇకపోతే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క సెలబ్రిటీ సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వారికి సంబంధించిన ఎన్నో వీడియోలు అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే శాంతి స్వరూప్ సైతం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను షేర్ చేశారు.ఇకపోతే శాంతి స్వరూప్ తన సొంత గ్రామమైన నెల్లూరు జిల్లా, జిట్రగుంట గ్రామంలోని వారి సొంత ఇల్లుని హోమ్ టూర్ వీడియో చేసి ఆ వీడియోలు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

తాను అదే ఇంట్లో పుట్టి పెరిగానని ఆ ఇంటిలో ఉన్న తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ఈ వీడియో ద్వారా తన ఇంటి ఆవరణంలో ఉన్న చెట్ల గురించి తెలియజేయడమే కాకుండా ఇంట్లోకి వెళ్ళగానే హైపర్ ఆది టీమ్ ఐదుగురు ఉన్నటువంటి ఫోటో ప్రేమ్ చూపించారు.

Shanti Swaroop Made A Home Tour In His Own Village Details, Shanti Swaroop, Home
Advertisement
Shanti Swaroop Made A Home Tour In His Own Village Details, Shanti Swaroop, Home

ఈ ఫోటోఫ్రేమ్ మా ఐదు మంది ఇళ్లల్లో ఉంటుందని శాంతి స్వరూప్ తెలిపారు.అదేవిధంగా జబర్దస్త్ రోజా గారితో కలిసి దిగిన ఫోటోలు కూడా ఫ్రేమ్ చేయించారు.అయితే నాగబాబు గారితో కలిసి దిగిన ఫోటోలు మంచివి లేకపోవడంతో తాను ఫ్రేమ్ కట్టించలేదని త్వరలోనే ఆయనతో కూడా ఫోటో దిగి ఫ్రేమ్ కట్టిస్తానని శాంతి స్వరూప్ తెలిపారు.

Shanti Swaroop Made A Home Tour In His Own Village Details, Shanti Swaroop, Home

ఇకపోతే తన ఇంటిలో ప్రతి గదిని చూపిస్తూ ఆ ఇంటితో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు.ఈ క్రమంలోనే ఈయన హోమ్ టూర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కెరియర్ పరంగా ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నానని అయితే తనకు తన సొంత గ్రామంతో ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయని ఈ సందర్భంగా శాంతి స్వరూప్ వెల్లడించారు.

ప్రస్తుతం ఈ హోమ్ టూర్ వీడియో వైరల్ అవుతుంది.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు