బీసీల ఆత్మగౌరవ సభలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు..!!

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో బీసీల కోసం తాను చేసిన ఉద్యమాన్ని సీఎం జగన్ గుర్తించారని తెలిపారు.పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని దాదాపు 40 సంవత్సరాల నుండి పోరాటం జరుగుతుంది.

ఈ క్రమంలో జగన్ చొరవ ప్రైవేటు బిల్లు పెట్టించడం జరిగిందని స్పష్టం చేశారు.రాష్ట్రంలో బీసీల అభివృద్ధికి సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.

అంతే కాదు రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బీసీల సభలు నిర్వహిస్తామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీకీ లక నేతలు మరియు బీసీ వర్గాలకు చెందిన నాయకులు ఇంకా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జన రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

 ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదని అన్నారు.జగన్ అధికారంలోకి వచ్చాక బీసీలకు పెద్దపీట వేశారని కొనియాడారు.అనేక సంక్షేమ పథకాలతో పాటు వివిధ పదవులలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందని అన్నారు.

వైసీపీ తరపున బీసీ నేత ఆర్ కృష్ణయ్య రాజ్యసభకు పంపిన ఘనత సీఎం జగన్ సొంతమని స్పష్టం చేశారు.దీంతో ఆర్ కృష్ణయ్య పార్లమెంటులో బీసీల సమస్యలను లేవనెత్తుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు