అమెరికా: ఓ పక్క పెరుగుతోన్న నేరాలు.. సిబ్బంది కొరతతో సియాటెల్ పోలీస్ శాఖ ఇక్కట్లు

సియాటెల్ నగరంలో క్రైమ్ రేట్ 14 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది.

అయితే పెరుగుతున్న నేరాలకు తగ్గట్టుగా సిబ్బంది నియామకాలు జరగకపోవడంతో నగర పోలీస్ శాఖ తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

ఇది సమాజాన్ని రక్షించే అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది.సియాటెల్ నగర మేయర్ బ్రూస్ హారెల్ గత వారం మాట్లాడుతూ.

ఈ ఏడాది 125 మంది కొత్త అధికారులను నియమించుకోవడానికి నిధులు వున్నాయని చెప్పారు.అధికారిక లెక్కల ప్రకారం.

జనవరిలో 20 మంది అధికారులు పోలీస్ శాఖ నుంచి నిష్క్రమించారు.ఇదే సమయంలో గతేడాది 171 మంది అధికారులు, 2020లో 186 మంది అధికారులు సియాటెల్ పోలీస్ శాఖ నుంచి నిష్క్రమించారు.

Advertisement

సియాటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ లెక్కల ప్రకారం.హింసాత్మక నేరాలు గతేడాది 20 శాతం పెరిగాయి.24 శాతం తీవ్రమైన దాడులు, 18 శాతం దోపిడీలు పెరగ్గా.హత్యలు 25 శాతం, అత్యాచారాలు 6 శాతం తగ్గాయి.

గతేడాది ఇక్కడ 612 కాల్పుల ఘటనలు జరిగాయి.ఇది 2020తో పోల్చితే 40 శాతం, 2019 కంటే 86 శాతం పెరుగుదల.

అలాగే ఆస్తి సంబంధిత నేరాలు కూడా 9 శాతం పెరిగాయి.

అయితే సియాటెల్ మాజీ మేయర్ జెన్నీ డర్కాన్ గతేడాది జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం.అధికారులకు 10 వేల నుంచి 25 వేల డాలర్ల నియామక బోనస్‌లను అనుమతించారు.అయితే ఆ నిధులు 2022లో అందుబాటులో వుండవని స్థానిక మీడియా తెలిపింది.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?

గతేడాది నవంబర్‌లో సియాటెల్ సిటీ కౌన్సిల్ బడ్జెట్ సవరణకు వ్యతిరేకంగా ఓటు వేసింది.దీంతో పోలీస్ శాఖ నుంచి మరో 101 మంది అధికారులను తొలగించాల్సి వచ్చింది.

Advertisement

సియాటెల్ తాత్కాలిక పోలీస్ చీఫ్ అడ్రియన్ డియాజ్ మాట్లాడుతూ.డిపార్ట్‌మెంట్‌కు ఎక్కువ మంది అధికారులు అవసరమన్నారు.

తాజా వార్తలు