షాకింగ్: మరో 8 ఏళ్ల చిన్నారి గుండెపోటుతో మృతి.. గుండెల్ని పిండేస్తోన్న వీడియో..

ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లలు సైతం గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తుండటం కలచివేస్తోంది.

మొన్నటికి మొన్న ఓ ఎనిమిదేళ్ల పాఠశాల బాలిక( School Girl ) గుండెపోటుతో( Heart Attack ) హఠాత్తుగా మృతి చెందడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

తాజాగా మరో విషాద ఘటన చోటు చేసుకుంది.ఈసారి కూడా ఓ 8 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారాన్ని కలిగిస్తోంది.

వివరాల్లోకి వెళితే, గార్గి రాణపరా( Gargi Ranapara ) అనే 8 ఏళ్ల చిన్నారి అహ్మదాబాద్‌లోని( Ahmedabad ) థల్తేజ్ ప్రాంతంలో ఉన్న జేబార్ స్కూల్ ఫర్ చిల్డ్రన్‌లో( Zebar School For Children ) శుక్రవారం ఉన్నట్టుండి మృతి చెందింది.మూడో తరగతి చదువుతున్న గార్గి, పాఠశాలకు వచ్చిన కొద్దిసేపటికే ఛాతీ నొప్పితో బాధపడింది.

క్లాస్ రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా, ఛాతీ నొప్పి ఎక్కువైంది.దాంతో పాఠశాల లాబీలో ఉన్న బల్లపై కూర్చుంది.

Advertisement

మరో క్షణంలోనే స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయింది.వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది బాలికను కాపాడేందుకు టీచర్లు సీపీఆర్ చేశారు.

అదే సమయంలో అంబులెన్స్‌కు ఫోన్ చేశారు.బాలిక పరిస్థితి విషమించడంతో, వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు ఆమెను బతికించేందుకు తీవ్రంగా శ్రమించారు.వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.

గార్గి గుండెపోటుతో మరణించిందని వైద్యులు నిర్ధారించారు.

పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌ నుంచి దూకిన ప్రయాణికులు.. వేరే ట్రైన్ కింద నలిగిపోయి.. ఘోర వీడియో!
చెక్‌బౌన్స్‌ కేసులో రామ్ గోపాల్ వర్మకు మూడు నెలల జైలు శిక్ష

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పాఠశాల ప్రిన్సిపల్ శర్మిష్ఠ సిన్హా వెల్లడించారు.గార్గి లాబీలోకి నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయని, ఆమె కొంచెం అనారోగ్యంగా కనిపించిందని తెలిపారు.కొద్దిసేపు కూర్చున్న వెంటనే కుప్పకూలిపోయిందని చెప్పారు.

Advertisement

సమీపంలో ఉన్న టీచర్లు, విద్యార్థులు వెంటనే ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించారని ఆమె వివరించారు.

గార్గికి గతంలో పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవని, అప్పుడప్పుడు స్వల్ప అనారోగ్యాలు మాత్రమే వచ్చేవని సమాచారం.ముంబైకి చెందిన గార్గి, తన బంధువుల ఇంటిలో ఉంటూ అహ్మదాబాద్‌లో చదువుకుంటుంది.స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.గుండెపోటుకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.

జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నీరజ్ బడ్గుజర్ మాట్లాడుతూ, ఆసుపత్రి నుంచి సమాచారం అందగానే తాము కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు.ఈ హఠాత్తు గుండెపోటుకు దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

ఇలాంటి ఘటనలు దేశంలో వరుసగా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.ఇటీవలే బెంగళూరులోనూ ఓ ఎనిమిదేళ్ల బాలిక పాఠశాల కారిడార్‌లో గుండెపోటుతో కుప్పకూలింది.

ఆమెను వెంటనే జేఎస్‌ఎస్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.చిన్న పిల్లలు ఇలా ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోతుండటం కలవరపెడుతోంది.

తల్లిదండ్రులు, పాఠశాలలు పిల్లల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి, ఇలాంటి విషాదాలను నివారించడానికి ఇంకేం చేయగలమనే ఆలోచనలో పడ్డారు.

తాజా వార్తలు