టాస్క్ ఓరియెంటెండ్ జాబ్స్ పేరుతో మోసాలు..: సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్ లో పెట్టుబడుల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా కేటుగాళ్లు మోసాలు చేస్తున్నారన్నారు.

టాస్క్ ఓరియెంటెడ్ జాబ్స్ అని మోసం చేస్తున్నారన్న సీపీ సీవీ ఆనంద్ చైనా, దుబాయ్ కేంద్రంగా ఫ్రాడ్ జరుగుతోందని తెలిపారు.నిందితులకు చెందిన 48 అకౌంట్లలో రూ.584 కోట్లతో పాటు మరో రూ.128 కోట్లు ఇతర అకౌంట్లలో జమ అయినట్లు గుర్తించామని వెల్లడించారు.ఈ క్రమంలోనే తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుంచి ల్యాప్ టాప్ లు, ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

ముంబై: మందుబాబులను చీపుర్లతో వీర బాదుడు బాదిన మహిళలు.. ఎందుకంటే..?

తాజా వార్తలు