పుదీనాతో డార్క్ సర్కిల్స్ కు చెప్పండి గుడ్ బై..!

పుదీనా( Mint ) గురించి పరిచయాలు అక్కర్లేదు.బిర్యానీ, పులావ్ మరియు నాన్ వెజ్ వంటల్లో పుదీనాను విరివిరిగా వాడుతుంటారు.

ఆహారం రుచి, ఫ్లేవర్ ను పెంచ‌డంలో పుదీనాకు మరొకటి సాటి లేదు.అలాగే ఆరోగ్యానికి కూడా పుదీనా చాలా మేలు చేస్తుంది.

చర్మ సౌందర్యాన్ని పెంచే సత్తా కూడా పుదీనాకు ఉంది.ముఖ్యంగా కళ్ళ చుట్టూ ఏర్పడిన డార్క్ సర్కిల్స్ ను వదిలించడానికి పుదీనా ఎంతో అద్భుతంగా తోడ్పడుతుంది.

చాలా మంది డార్క్ సర్కిల్స్( Dark circles ) కారణంగా తమ ముఖాన్ని అద్దంలో చూసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే రెమెడీని తప్పక ఫాలో అవ్వండి.

Advertisement

ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ప‌ది ఫ్రెష్ పుదీనా ఆకులు వేసుకోవాలి.అలాగే ఐదు ఫ్రెష్ తులసి ఆకులు( Basil leaves ) మరియు మూడు కీర దోసకాయ స్లైసెస్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో చూసిన ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ( Aloe vera gel )వేసి బాగా మిక్స్ చేయాలి.ఆపై ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు ఉదయం స్నానం చేయడానికి గంట ముందు మరియు నిద్రించడానికి ముందు తయారు చేసుకున్న‌ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని ప‌ది నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

రెగ్యులర్ గా ఈ విధంగా కనుక చేశారంటే కొద్ది రోజుల్లోనే మీ డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి.కళ్ళ చుట్టూ నలుపు మొత్తం పోతుంది.అలాగే ఈ హోమ్ రెమెడీని పాటించడంతో పాటు కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.

దేవర సాంగ్ కాపీ సాంగ్ అంటూ ట్రోల్స్.. కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారుగా!
ఊరగాయను బహుమతిగా ఇవ్వడం మంచిదేనా..? అసలు వాస్తవం ఏమిటంటే..?

రోజుకు ఖచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రించండి.ఒత్తిడికి దూరంగా ఉండండి.

Advertisement

స్మోకింగ్ అలవాటు ఉంటే మానుకోండి.నిత్యం అరగంట వ్యాయామం చేయండి.

పోషకాహారాన్ని డైట్ లో చేర్చుకోండి.రోజుకు ఒక హెర్బల్ టీను తీసుకోవడం అలవాటు చేసుకోండి.

ఈ చిన్న చిన్న మార్పులు మీ శారీరక ఆరోగ్యంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని సైతం పెంచుతాయి.

తాజా వార్తలు