సర్దార్ గబ్బర్ సింగ్ రివ్యూ

చిత్రం : సర్దార్ గబ్బర్ సింగ్

బ్యానర్: పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్, ఎరోస్ ఇంటర్నేషనల్

డైరెక్టర్ : K.S.

రవీంద్ర (బాబీ)

నిర్మాత: పవన్ కల్యాణ్, శరత్ మరార్, సునీల్ లుల్ల

మ్యూజిక్ డైరెక్టర్: దేవి శ్రీ ప్రసాద్

విడుదల తేది :

April 8, 2016

నటినటులు: పవన్ కళ్యాణ్, కాజల్, రాయ్ లక్ష్మి, శరద్ కేల్కర్, బ్రహ్మానందం

పవన్ కళ్యాణ్ మేనియా ని తెలుపుతూ ఎక్కడా టికెట్ లు కూడా దొరకని రేంజ్ లో సర్దార్ గబ్బర్ సింగ్ రానే ఒచ్చింది.ఊఫోరియా లాగా పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో ఫాన్స్ ఎగబడుతున్న ఈ సినిమా రివ్యూ ఇప్పుడు చూద్దాం.

అత్తారింటికి దారేది తరవాత పవన్ కళ్యాణ్ చేసిన మొట్ట మొదటి సోలో సినిమా కావడం.పవన్ కళ్యాణ్ స్వయంగా స్క్రీన్ ప్లే , స్టొరీ ఇవ్వడం.డాన్స్ లూ, ఫైట్ లూ కూడా తానే కంపోజ్ చెయ్యడం ఈ సినిమా కి మరింత అట్రాక్షన్ ని తీసుకుని ఒచ్చాయి.

చిన్న డైరెక్టర్ అయినా కూడా పవన్ కళ్యాణ్ మేనియా తో థియేటర్ లు మొదటి రోజు నిండిపోయాయి.మొత్తం మీద పవన్ కళ్యాణ్ తన ఫాన్స్ కి అంకితం అంటూ తీసిన ఈ సినిమా ఎలా వర్క్ అయ్యిందో చూద్దాం .

పాజిటివ్ లు

రతన్ పుర సంస్థానం మీద కన్నేసిన భైరవ సింగ్ ఆ సంస్థానాన్ని మాత్రమే కాకుండా ఆ సంస్థాన యువరాణి ని కూడా పెళ్లి చేసుకుని తన వశం చేసుకోవాలి అని చూస్తూ ఉంటాడు.అతని దురాగతాలు రోజు రోజుకీ పెరిగిపోతూ ఉన్న క్రమం లో పవన్ కళ్యాణ్ - సర్దార్ గబ్బర్ సింగ్ గా అక్కడ అడుగు పెట్టి అతన్ని అణిచే ప్రయత్నం చేస్తాడు.

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయిన పవన్ భైరవ్ సింగ్ ని ఇంటర్వెల్ లో ఫేస్ టూ ఫేస్ ఎదురు కోవడం తో కథ సగం పూర్తిఅవుతుంది.అటు పైన సెకండ్ హాఫ్ లో కాజల్ ఫామిలీ కి సంబంధించి ఒచ్చే అతిపెద్ద ట్విస్ట్ అది కూడా పవన్ కళ్యాణ్ కి రిలేటెడ్ గా ఉండడం తో పవన్ కీ - కాజల్ కుటుంబానికీ సంబంధం ఏంటి అనే వైపు కథ వెళుతుంది.

Advertisement

పవన్ కళ్యాణ్ అన్నీ తానై ఈ సినిమాని నడిపించాడు అని చెప్పాలి .డాన్స్ గానీ, డైలాగ్ లు కానీ ఫాన్స్ కి ఫుల్ పండగ .కాజల్ తన పరిధి లో బాగా చేసింది.బ్రహ్మానందం - పవన్ కళ్యాణ్ ల మధ్యన సన్నివేశాలు జల్సా తరవాత మళ్ళీ ఆ రేంజ్ లో కుదిరాయి .మిగిలిన తారాగణం ఓకే అనిపించారు.కామెడీ ని పండించడం లో డైరెక్టర్ చాలా కొత్త పంథా ని ఎంచుకున్నాడు.

రివెర్స్ అంత్యాక్షరీ సీన్ హై లైట్ అని చెప్పాలి.ఇంటర్వెల్ బ్యాంగ్ ని బాగా రాసారు.

స్క్రీన్ ప్లే ఒక కొత్త మోడ్ లో వెళుతుంది.అన్నిటినీ మించి సాయి మాధవ్ బుర్రా డైలాగులు చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి.

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి మంచి మార్కులు పడ్డాయి.

నెగెటివ్ లు

ఇంటర్వెల్ బ్యాంగ్ ని ఇంకా బాగా క్యారీ చెయ్యచ్చు అనిపించింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
1000 కోట్లతో చరిత్ర సృష్టించిన పుష్పరాజ్.. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమానే!

సెకండ్ హాఫ్ మొదలైన కాసేపూ చాలా సాగదీసారు.ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఊపు ని సెకండ్ హాఫ్ మొదట్లో చాలా బోర్ అనిపిస్తుంది.

Advertisement

కాజల్ - పవన్ కళ్యాణ్ ల మీద కెమిస్ట్రీ సరిగా వర్క్ కానే లేదు.చాలా చోట్ల ఇంపార్టెంట్ లాజిక్ లు మిస్ అయ్యాడు డైరెక్టర్.

ఫైట్ సీక్వెన్స్ లలో ఓవర్ ఫైట్ లూ హై జంప్ లూ ఎక్కువ అయ్యాయి.బ్రహ్మానందం బాగా చేసినా చాలా చోట్ల మరీ టూమచ్ సిల్లీ కామెడీ లాగా అనిపిస్తుంది.

నిజానికి ఫస్ట్ హాఫ్ లోనే బ్రాహ్మీ ని ఇంకా పర్ఫెక్ట్ గా వాడాల్సిన అవసరం ఉంది కానీ ఆ సీన్ లు కట్ చేసారో లేక సీన్ లు లేవో అర్ధం కాలేదు.కొన్ని గెటప్ లు పవన్ కి సెట్ కాలేదు పాటల పిక్చరైజేషన్ బాగున్నా సరైన సమయం లో పాటలు రాలేదు అనిపిస్తుంది.

ఫస్ట్ హాఫ్ ఆ రేంజ్ లో ఉండి సెకండ్ హాఫ్ ని పూర్తిగా డల్ చేసాడు అని ఖచ్చితంగా చెప్పచ్చు.

మొత్తంగా

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో ఎన్ని ఇబ్బందికర విషయాలు ఉన్నా పవన్ కళ్యాణ్ తన నటన, ఆహార్యం , స్టైల్, డైలాగ్ లతో సింగిల్ హ్యాండెడ్ గా సినిమాని లాక్కోచ్చేసాడు.

ఎక్కడైనా సినిమా కాస్త ఫ్లాట్ అవుతోంది అనిపించిన చోట యాటిట్యూడ్ తో కళ్యాణ్ సూపర్ అనిపించాడు.కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా డల్ గా కనపడగా పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేని పరిస్థితి.

ఫుల్ పైసా వసూల్ ఎంటర్టైనర్ గా సర్దార్ గబ్బర్ సింగ్ కలక్షన్ లు రాబడుతుంది.కామెడీ కేంద్రం గా ఫామిలీస్ థియేటర్ లకి వచ్చేస్తారు.

బ్లాక్ బస్టర్ రేంజ్ కాకపోయినా యావరేజ్ రేంజ్ ని చూపిస్తూ దానికి తగ్గ రెవెన్యూ చేస్తుంది.బాబీ డైరెక్షన్ కంటే కళ్యాణ్ తిక్క ఈ సినిమాకి పర్ఫెక్ట్ హిట్ ని ఇస్తుందా లేదా అనేది ఫామిలీ ప్రేక్షకులు ఆదరించే దాని బట్టి ఉంటుంది.

రేటింగ్ :3/5

తాజా వార్తలు