మినీ కథ కాస్త కలిసి వచ్చినట్లే ఉంది.. రెంటికి ఛాన్స్‌

వర్షం చిత్ర దర్శకుడు శోభన్‌ తనయుడు సంతోష్‌ శోభన్‌ హీరోగా పరిచయం అయ్యి ఏళ్లు గడుస్తుంది.

కాని ఇప్పటి వరకు ఆయన కమర్షియల్‌ సినిమా పడింది లేదు.

ఎట్టకేలకు ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంతోష్‌ పర్వాలేదు అనిపించాడు.కామెడీ యాంగిల్‌ లో సాగిన అడల్ట్‌ మూవీ సక్సెస్ టాక్ ను దక్కించుకుంది.

Santhosh Sobhan Gets Two Movie Offers , Ek Mini Katha, Film News, Prabhas , Sa

ఆ సినిమా కథ బోల్డ్‌ గా ఉన్నా కూడా దర్శకుడిపై నమ్మకంతో సినిమాను చేసేందుకు సంతోష్‌ ఓకే చెప్పాడు.సంతోష్‌ ఈ సినిమా చేసేందుకు సిద్దం అవ్వడం నిజంగా అభినందనీయం అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

చిన్న కథ అయినా కూడా మంచి కాన్సెప్ట్‌ అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఓటీటీ ద్వారా విడుదల అయ్యి పాజిటివ్‌ టాక్ ను దక్కించుకుంది.

Advertisement

సంతోష్‌ శోభన్‌ హీరోగా మొదటి సక్సెస్‌ ను దక్కించుకున్నాడు.ఆ సినిమా వచ్చి వారం అయ్యిందో లేదో అప్పుడే ఆయన కు రెండు ఆఫర్లు వచ్చినట్లుగా తెలుస్తోంది.

ప్రముక నిర్మాత ఇటీవలే ఆయనకు అడ్వాన్స్ ను కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.కొత్త దర్శకుడితో సంతోష్‌ శోభన్‌ తదుపరి సినిమా రూపొందబోతున్నట్లుగా తెలుస్తోంది.

మరో సినిమా కు కూడా చర్చలు జరుగుతున్నాయి.మొత్తానికి ఒక్క సక్సెస్‌ తో ఏకంగా రెండు సినిమాల ఆఫర్లను సంతోష్‌ శోభన్ దక్కించుకున్నాడు.

సంతోష్ కు ప్రభాస్‌ తో పాటు పలువురు స్టార్స్ మద్దతు ఉంది.కనుక ఆయన హీరోగా సినిమాలు చేయడం వల్ల మంచి పబ్లిసిటీ దక్కుతుందనే నమ్మకంను కొందరు నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

కనుక సంతోష్‌ శోభన్‌ మూవీ అంటే కొందరు నిర్మాతలు ముందుకు వస్తున్నారు.ఇదే సమయంలో దర్శకులు కూడా ఆయన కోసం కథలు సిద్దం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు