అమెరికాలో 'పరమానంద శిష్యులు'

తెలుగు వారి పండుగలలో పెద్ద పండుగగా పిలువబడే సంక్రాంతి అంటే చిన్న పెద్ద అందరికి ఎంతగానో ఇష్టం.

ఎంత దూరంలో ఉన్న సరే బందువులంతా ఒకే ఇంటికి చేరి కొలహలంగా పండుగ జపురుకుంటారు.

కాని విదేశాలలో స్థిరపడిన వారికి సొంత ఊరికి రావాలని ఉన్నా, సెలవలు దొరకకో, ఏ ఇతర కారణం చేతనో వెళ్ళలేకపోతున్నారు.అయితే, అమెరికాలో ఉండే తెలుగు వారి సంక్షేమం కోసం ఎన్నో సంస్థలు ఉన్నాయి, వాటిలో తెలుగు కళాసమితి చెప్పుకోతగ్గది.

తెలుగు కళలను ప్రోత్సహిస్తూ, ఎల్లప్పుడు తెలుగు వారికి సహాయ సహకారాలను అందిస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే.

న్యూజెర్సీలోని తెలుగు కళాసమితి (టిఫాన్) సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది.అక్కడి తెలుగు వారంతా ఒకే వేదికపై ఎంతో ఆనందంగా ఈ వేడుకలను కన్నుల పండుగగా జరుపుకున్నారు.

Advertisement

ఎన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి.మరీ ముఖ్యంగా పాఠశాల విద్యార్ధులు వారి ప్రతిభను అద్బుతంగా కనబరిచారు.

ఈ నేపధ్యంలోనే.

కొందరు పాఠశాల విద్యార్ధులచే ప్రదర్శించబడిన పరమానందయ్య శిష్యుల కధ నాటిక ఎంతో హాస్యభరితంగా అందరిని అలరించింది.ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ నిజంగానే పరమందయ్య,వారి శిష్యులను కళ్ళకు కట్టినట్టు చూపించారు.ఇదిలాఉంటే, విద్యార్ధులు ఈ నాటకాన్ని న్యూజెర్సీ పాఠశాల ఏరియా డైరెక్టర్ రామ్మోహన్ వేదాంతం, సెంటర్ కోఆర్డినేటర్ కుమార్ తాడేపల్లి, టీచర్లు కృష్ణ జోగిన పల్లి ఆధ్వర్యంలో ప్రదర్శించారు.

స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!
Advertisement

తాజా వార్తలు