Samyuktha Menon: డైరెక్టర్ కార్తీక్ వర్మకి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన సంయుక్త మీనన్.. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్( Saidharam Tej ) హీరోగా నటించిన విరూపాక్ష సినిమా( Virupaksha ) ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

కార్తీక్ దండు( Director Karthik Dandu ) దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా భారీ అంచనా నడుమ విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ని అందుకుంది.అంతేకాకుండా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.

ఇప్పటికే ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ ని దాటిన విషయం తెలిసిందే.సాయి ధరంతేజ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచింది.

ప్రస్తుతం చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement

ఈ సినిమాతో డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయమైన సంగతి మనందరికీ తెలిసిందే.మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ను అందుకున్నారు డైరెక్టర్ కార్తీక్.ఇది ఇలా ఉంటే మామూలుగా ఒక సినిమా హిట్ అయితే నిర్మాతలు లేదా హీరోలు నిర్మాతలకు ఖరీదైన గిఫ్ట్ లను ఇస్తూ ఉంటారు.

కానీ ఇక్కడ మాత్రం ఒక హీరోయిన్ డైరెక్టర్ కు గిఫ్ట్ ఇచ్చింది.ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా సంయుక్త మీనన్( Samyuktha Menon ) నటించిన విషయం తెలిసిందే.

సినిమా మంచి సక్సెస్ అయిన సందర్భంగా తాజాగా హీరోయిన్ సంయుక్త డైరెక్టర్ కార్తీక్ కి ఒక ఖరీదైన గిఫ్ట్ ఇచ్చింది.ఇదే విషయాన్ని సంయుక్త స్వయంగా చెప్పుకొచ్చింది.

ఈ సినిమా విడుదలైన రోజు చిత్ర బృందంతో కలిసి డైరెక్టర్ కార్తీక్ హైదరాబాదులోని ఒక థియేటర్ కు వెళ్లారట.అక్కడ ప్రేక్షకుల రద్దీ ఎక్కువగా ఉండడంతో డైరెక్టర్ కార్తీక్ మొబైల్ పోయిందట.ఇక ఆ విషయం తెలుసుకున్న సంయుక్త డైరెక్టర్ కి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాను ఇంతలోపే ఆ విషయం తెలిసింది అందుకే ఐఫోన్ ని గిఫ్ట్ గా ఇచ్చాను అని చెప్పుకొచ్చింది.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

అయితే డైరెక్టర్ సిమ్ వర్క్ చేయడానికి ఒక రోజు సమయం పట్టింది.ఒక రోజు మొత్తం మెసేజ్ లు, ఫోన్ కాల్స్ అన్నీ ఆగిపోయాయి.సోషల్‌ మీడియాలో కూడా సినిమా గురించి ఏం నడుస్తోంది అనేది తెలియకుండా పోయింది.

Advertisement

ఆ సమయంలో ఉన్న వేరే వాళ్ల ఫోన్ ద్వారా డైరెక్టర్‌ సినిమా అప్ డేట్స్‌ తెలుసుకున్నారు అని సంయుక్త మీనన్ చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు