సమంత 'సామ్‌జామ్‌' ఆ కొన్ని ఎపిసోడ్లకే పరిమితమా?

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత హీరోయిన్‌గా తక్కువ కనిపిస్తూ ఇతర యాక్టివిటీస్‌ మరియు షోలతో ఎక్కువగా మీడియాలో కనిపిస్తుంది.

కరోనా కారణంగానో లేదా మరేంటో కాని సినిమాల సంఖ్య సమంత చాలా తగ్గించింది.

ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమా ఏంటీ అంటే ఠక్కున చెప్పలేని పరిస్థితి.అలాంటి నేపథ్యంలో ఆమె నుండి ఆహా కోసం సామ్‌జామ్‌ టాక్‌ షో ప్రకటన వచ్చింది.

ఆహా కోసం తమన్నా టాక్‌ షో నిర్వహించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని ఆమె ను వెబ్‌ సిరీస్‌ కు పరిమితం చేసి సమంతను టాక్‌ షో కోసం తీసుకోవడం జరిగింది.

సామ్‌ జామ్‌ అంటూ గత వారం టాక్‌ షో ప్రారంభం అయ్యింది.మొత్తం 15 వారాల పాటు సామ్‌ జామ్‌ టాక్‌ షో ఒకొక్క ఎపిసోడ్‌ చొప్పున ఎంటర్‌టైన్‌ చేయబోతున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు.

Samantha Samjam Talk Show Only 15 Episodes, Tamanna Talk Show, Sam Jam, Samantha
Advertisement
Samantha Samjam Talk Show Only 15 Episodes, Tamanna Talk Show, Sam Jam, Samantha

సాదారణంగా అయితే ఇలాంటి వాటికి సీజన్‌లు ఉంటాయి.కాని సామ్‌ జామ్‌ కు సీజన్‌ లు ఉంటాయా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు.ఎందుకంటే సమంతను ఆహా వారు కేవలం ఒక్క సీజన్‌కు మాత్రమే ఒప్పందం అడిగారు.

ఇప్పటికే సమంత ఆ 15 ఎపిసోడ్లకు షూటింగ్‌ పూర్తి చేసంది. మొత్తం 15 మంది ప్రముఖులతో ఇంటర్వ్యూలు పూర్తి చేసిన సమంత మళ్లీ సామ్‌ జామ్‌ షో కు వస్తుందో రాదో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా టాక్‌ షో ను చాలా విభిన్నంగా దర్శకురాలు నందిని రెడ్డి ప్లాన్‌ చేస్తుందని ప్రకటన సమంలో చెప్పారు.కాని తీవ్రంగా నిరాశ పర్చే విధంగా టాక్‌ షో ఉంది.

టాక్‌ తక్కువ అయ్యింది.షో ఎక్కువ అయ్యింది అంటూ నెటిజన్సమ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

ఆహా నుండి ఇంకాస్త ఎక్కువ ఆశించామని సామ్‌ జామ్‌ మెప్పించలేక పోయింది అంటూ నెటిజన్స్‌ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.దాంతో సీజన్‌ 2 ఉంటుందా లేదా అనేది ఇప్పటి నుండే అనుమానంగా ఉంది.

Advertisement

కనుక 15 ఎపిసోడ్‌లతోనే సామ్‌ జామ్‌ ముగింపు పలికే అవకాశం ఉందనిపిస్తుంది.

తాజా వార్తలు