ప్రతి అమ్మాయికి ఇలాంటి అన్న ఒకరు ఉండాలి.. సమంత కామెంట్స్ వైరల్!

అలియాభట్‌, వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న జిగ్రా( Jigra ) సినిమా అక్టోబర్‌ 11న విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాదులో ఎంతో ఘనంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సమంత ( Samantha ) , రానా( Rana ), రాహుల్ రవీందర్ వంటి తదితరులు హాజరై సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సమంత పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపించారు.ఇటీవల కాలంలో సమంత ముంబైకి పరిమితం కావడంతో ముంబైలో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు హైదరాబాద్ కి కూడా రావాలి అంటూ కోరారు.

Samantha Interesting Comment On Rana At Jigra Pre Release , Samantha, Rana,broth

ఇక సమంత కూడా ఇన్ని రోజుల తన వ్యక్తిగత కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి మీడియా కూడా చాలా దూరంగా ఉన్నారు.అయితే ఇప్పుడిప్పుడే సమంత పూర్తిగా కోలుకోవడంతో ఈమె తిరిగి సినిమా పనులలో బిజీ అయ్యారు.ఇక ఈ సినిమా వేడుకలో భాగంగా సమంత వేదికపై మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Samantha Interesting Comment On Rana At Jigra Pre Release , Samantha, Rana,broth

హీరోయిన్స్‌కి ఎంతో బాధ్యత ఉంటుందని అన్నారు.ప్రతి అమ్మాయి కథలో ఆ అమ్మాయే హీరో అని చెప్పారు.చాలా రోజుల తరువాత మీ ముందుకు వచ్చానని, జిగ్రా మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు.

Advertisement
Samantha Interesting Comment On Rana At Jigra Pre Release , Samantha, Rana,Broth

ఇక ప్రతి ఒక్క అమ్మాయి జీవితంలో రానా లాంటి ఒక అన్నయ్య ఉండాలని ఈమె ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక తెలుగు సినీ ప్రేక్షకులే నా ఫ్యామిలీ అంటూ ఈ సందర్భంగా సమంత వెల్లడించారు.

ఇక రానా లాంటి అన్నయ్య కావాలని సమంత ఈ సందర్భంగా చెప్పడంతో రానా సమంత మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందో స్పష్టంగా అర్థమవుతుంది.

Advertisement

తాజా వార్తలు