సమంత ముచ్చట తీరబోతుంది

సమంతకు తెలుగులో ఆమె నటించిన సినిమాలకు డబ్బింగ్‌ చెప్పుకోవాలని చాలా కాలంగా కోరిక ఉంది.అందుకోసం తెలుగును కూడా నేర్చుకుంది.

ప్రసుత్తం తెలుగును అనర్గలంగా మాట్లాడగలిగే సమంతకు ఇప్పటి వరకు డబ్బింగ్‌ చెప్పుకునే అవకాశం దక్కలేదు.అయితే ‘అఆ’ చిత్రంతో సమంత కోరిక నెరవేరబోతున్నట్లుగా సమచారం అందుతోంది.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నితిన్‌ హీరోగా నటిస్తున్న ‘అఆ’ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమాలో సమంతతో త్రివిక్రమ్‌ డబ్బింగ్‌ చెప్పించేందుకు ఓకే చెప్పాడు.

తమ పాత్రలకు తామే డబ్బింగ్‌ చెప్పుకున్న హీరోయిన్స్‌ టాలీవుడ్‌లో చాలా అరుదు.గతంలో ఛార్మి కొన్ని సినిమాలకు డబ్బింగ్‌ చెప్పుకుంది.

Advertisement

ఇక కొందరు తెలుగు అమ్మాయిలు డబ్బింగ్‌ చెప్పుకున్నారు.అంతే తప్ప ప్రస్తుతం ఉన్న స్టార్‌ హీరోయిన్స్‌ కాజల్‌, తమన్నా, శృతిహాసన్‌ వంటి వారు డబ్బింగ్‌ జోలికే వెళ్లింది లేదు.

సమంత డబ్బింగ్‌ చెప్పబోతుండటంతో అందరి దృష్టి ప్రస్తుతం ‘అఆ’ చిత్రంపై ఉంది.తప్పకుండా సమంత డబ్బింగ్‌ ‘అఆ’ చిత్రానికి ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.మరో వైపు సమంత మహేష్‌బాబు ‘బ్రహ్మోత్సవం’ చిత్రంతో పాటు తమిళంలో వరుస సినిమాలతో దూసుకు పోతుంది.

కమెడియన్లుగా మారిన టాలీవుడ్ విలన్లు ఎవరో తెలుసా?
Advertisement

తాజా వార్తలు